NTV Telugu Site icon

BJP: అవార్డులు కావాలంటే సౌదీ వెళ్లండి.. మదర్సా విద్యార్థులపై బీజేపీ నేత..

Up Madrasa Students,

Up Madrasa Students,

BJP: ఉత్తర్ ప్రదేశ్‌లో మదర్సా విద్యార్థులకు అవార్డులు ఇవ్వకపోవడంపై రాజకీయ వివాదం రాజుకుంది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ పార్టీల నేతలు అధికార బీజేపీని విమర్శిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అవార్డులు కావాలంటే సౌదీ అరేబియా వెళ్లి పొందొచ్చని ఆయన అన్నారు. సంస్కృతం, రాష్ట్ర బోర్డ్ స్కూల్స్‌లో టాపర్‌లుగా నిలిచిన విద్యార్థలును ప్రభుత్వం గౌరవించిందని, మదర్సాలో చదువుతున్న విద్యార్థులును ఎందుకు గౌరవించలేదని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సీఎం యోగి ప్రభుత్వం అన్ని మతాలను సమానరక్షణ కల్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

Read Also: CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం భేటీ.. కీలక ఆదేశాలు

‘‘సబ్‌ కా సాథ్, సబ్ కా వికాస్’’ నినాదం ఇచ్చిన ప్రభుత్వం మదర్సా బోర్డు పిల్లలను ఎందుకు అవార్డులతో సత్కరించడం లేదు అని సేలంపూర్ ఎంపీ, ఎస్పీ నేత రామశకర్ రాజ్‌భర్ అడిగారు. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ స్పందిస్తూ రాజ్యంగం అన్ని మతాలను, భాషలను పరిరక్షిస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత మొహ్సిన్ రజా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘‘మత విద్యలో పురోగతి’’ కోసం ఎలాంటి అవార్డులు ఇవ్వరని స్పష్టం చేశారు. అలాంటి అవార్డులు కావాలంటే సౌదీ అరేబియా వెళ్లి తెచ్చుకోవాలని సూచించారు.

ఇటీవల యూపీ ప్రభుత్వం 10, 12వ తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష నగదు బహుమతిని ప్రకటించింది. యుపి బోర్డ్ ఆఫ్ సెకండరీ సంస్కృత ఎడ్యుకేషన్ కౌన్సిల్, సిబిఎస్‌ఇ మరియు సిఐఎస్‌సిఇ పరీక్షలలో రాష్ట్రంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని కూడా సత్కరిస్తున్నారు. అవార్డుల కోసం ప్రభుత్వం రూ.4.73 కోట్లు కేటాయించింది.

Show comments