Site icon NTV Telugu

Shivraj Singh Chouhan: 6 ఏళ్ల తర్వాత చెప్పులేసుకున్న బీజేపీ కార్యకర్త.. స్వయంగా షూలు అందించిన మాజీ సీఎం..

Madhya Pradesh

Madhya Pradesh

Shivraj Singh Chouhan: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కాంగ్రెస్ నుంచి గెలుచుకోగా.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారం నిలుపుకుంది. కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ మాజీ సీఎంలను కాదని కొత్త ముఖాలను సీఎంలుగా ఎన్నుకుంది.

Read Also: Air India: ఎయిర్ ఇండియా చేతికి మొట్టమొదటి ఎయిర్‌బస్ A350-900.. ఆకాశంలో ఇంద్రభవనం ఈ విమానం..

ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అఖండ విజయం సాధించింది. 230 స్థానాలు ఎంపీ అసెంబ్లీలో ఏకంగా 163 స్థానాలను కైవసం చేసుకోగా.. కేవలం 66 సీట్లకే కాంగ్రెస్ పరిమితమైంది. అయితే బీజేపీ గెలుపుపై శపథం చేసిన కార్యకర్త 6 ఏళ్ల తర్వాత కాళ్లకు చెప్పులు తొడిగారు. 2018లో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది, అప్పటి నుంచి బీజేపీ విజయం సాధించే వరకు చెప్పులు తొడగనని బీజేపీ అనుప్పూర్ జిల్లా యూనిట్ అధ్యక్షుడిగా ఉన్న రాందాస్ పూరి శపథం చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించడంతో ఆరేళ్ల విరామం తర్వాత ఈ రోజు కాళ్లకు చెప్పులు తొడిగారు. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా ఆయనకు షూలను అందించారు. ‘‘రామదాస్ పూరీ జీ కష్టపడి పనిచేసే మరియు అంకితభావంతో పనిచేసే పార్టీ కార్యకర్త, అతను 2017 నుండి బూట్లు మరియు చెప్పులు ధరించడం మానేశాడు. ఎండా, వర్షం, శీతాకాలాల్లో చెప్పులు లేకుండా ఉన్నాడు. ఇప్పడు ఆయన శపథం నెరవేరింది.’’ అంటూ శివరాజ్ సింగ్ తన ఎక్స్(ట్విట్టర్)లో వీడియోను షేర్ చేశారు.

Exit mobile version