NTV Telugu Site icon

Sushil Modi: నితీష్ కుమార్ తన జీవితంలో ప్రధాని కాలేడు.. ఆర్జేడీ బీహార్‌ని జేడీయూ ముక్త్ చేస్తుంది.

Bihar Politics

Bihar Politics

BJP Leader sushil modi comments on cm nitish kumar: బీజేపీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. బీహార్ పొత్తు వదులకున్న తర్వాత నుంచి సుశీల్ మోదీ, నితీష్ కుమార్ పై వరసగా విమర్శలు చేస్తున్నారు. నితీష్ కుమార్ తన జీవితంలో ప్రధాని కాలేడని.. ఆర్జేడీ పార్టీ బీహార్ లో జేడీయూ లేకుండా చేస్తుందని జోస్యం చెప్పారు. మణిపూర్ రాష్ట్రంలో ఏడుగురిలో ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో నితీష్ కుమార్ కు బిగ్ షాక్ తగిలింది. గతంలో అరుణాచల్ ప్రదేశ్ లో కూడా జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.

ఈ విషయంపై కూడా సుశీల్ మోదీ స్పందించారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లు జేడీయూ నుంచి విముక్తి పొందాయన్నారు. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ త్వరలోనే జనతాదళ్(యునైటెడ్)( జేడీయూ) పార్టీని విచ్ఛిన్నం చేస్తారని అన్నారు. రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ(ఆర్జేడీ) బీహార్ లో ‘జేడీయూ ముక్త్’ చేస్తుంనది ఆయన అన్నారు. మణిపూర్ లో బీజేపీ ధనబలం ఉపయోగించి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని.. ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను నిరాధారమైనవని సువీల్ మోదీ అన్నారు. మీ పార్టీలు డబ్బులతో కొనుగోలు చేసేంత వీక్ గా ఉన్నారా..? అంటూ ప్రశ్నించారు. మణిపూర్ జేడీయూ ఎమ్మెల్యేలు ఎన్డీయేతో ఉండాలనుకుని బీజేపీలో చేరాలని అనుకున్నారని సుశీల్ మోదీ అన్నారు.

Read Also: Team India: టీమిండియాకు బిగ్‌షాక్ తప్పదా? అతడి స్థానాన్ని రీప్లేస్ చేసేదెవరు?

జేడీయూ జాతీయ పార్టీ కావాలని కలలు కందని.. గతంలో మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉంటే ప్రస్తుతం బీహార్ కే పరిమితం అయిందని ఎద్దేవా చేశారు. నితీష్ కుమార్ జాతీయ స్థాయిలో వార్తల్లో ఉండేందుకే ఎన్డీయే, బీజేపీతో పొత్తు తెంచుకున్నారని ఆయన అన్నారు. పోస్టర్లు, హోర్డింగులు ఎవరిని ప్రధాని చేయలేవని.. నితీష్ కుమార్ ఎన్నటికి ప్రధాన మంత్రి కాలేడని అన్నారు. ఇక పార్టీ 5-10 ఎంపీలను కలిగి ఉంటే ఎలా ప్రధాని అవుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇటీవల బీహార్ లో నితీష్ కుమార్ జేడీయూ పార్టీ బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో బీజేపీ బీహార్ లో ప్రతిపక్ష పార్టీగా మారింది. జేడీయూ ఈ స్టెప్ తీసుకున్న కొన్ని రోజుల తర్వాత మణిపూర్ రాష్ట్రంలో నితీష్ కుమార్ కు బీజేపీ బిగ్ షాక్ ఇచ్చింది.