BJP Leader KS Eshwarappa Controversial Comments On Azaan: సీనియర్ బీజేపీ నాయకుడు, కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ‘అజాన్’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘అల్లా ఏమైనా చెవిటివాడా.. ఆయనను పిలవడానికి లౌడ్‌స్పీకర్లు ఉపయోగించాల్సిన అవసరం ఉందా?’ అని ప్రశ్నించారు. తాను బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో.. సమీపంలో ఉండే మసీదు నుండి ‘అజాన్’ వచ్చిందని, తానె ఎక్కడికి వెళ్లినా ఈ అజాన్ తలనొప్పిగా మారిందంటూ వ్యాఖ్యానించారు. ఈ అజాన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పు రావాల్సి ఉందని.. ఈరోజు కాకపోతే కచ్ఛితంగా అజాన్‌ని నిలిపివేయాలంటూ ఏదో ఒక రోజు పిలుపు తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు.
Amjad Basha: ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసింది జగనే
హిందూ ఆలయాలలో అమ్మాయిలు, మహిళలు ప్రార్థనలతో పాటు భజనలు చేస్తారని.. తామూ మతపరమైన వాళ్లమేనని, కానీ లౌడ్ స్పీకర్లను వినియోగించమని ఈశ్వరప్ప అన్నారు. మీరు లౌడ్ స్పీకర్లను వినియోగించి ప్రార్థనలకు పిలవవలసి వస్తే.. అప్పుడు దానర్థం అల్లా చెవిడివాడేనని చెప్పారు. ఈ విధంగా ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాగా.. ఉప ముఖ్యమంత్రిగానూ పని చేసిన ఈశ్వరప్పకు వివాదాలు కొత్తేమీ కాదు. 18వ శతాబ్దపు మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్‌ను ‘ముస్లిం గూండా’గా పేర్కొన్నప్పుడు కూడా వివాదం చెలరేగింది. గతేడాది ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసు వ్యవహారంలో.. ఈ సీనియర్ నేత తన మంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. తాను ఆత్మహత్య చేసుకోవడానికి పంపించిన చివరి మెసేజ్‌లలో.. తన సూసైడ్‌కి ఈశ్వరప్పే ప్రధాన కారణమని ఆ కాంట్రాక్టర్ పేర్కొనడంతో, ఆ నేతపై పోలీసులు కేసు పెట్టారు. అప్పట్లో ఈ కేసు విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
BANDI SANJAY : RRRపై బండి సంజయ్ ప్రశంసలు.. టీబీజేపీ చీఫ్ ట్వీట్ పై నెటిజన్స్ ఫైర్
ఇదిలావుండగా.. ‘అజాన్’ అంశం చాలాకాలం నుంచి చర్చనీయాంశంగా ఉంది. ప్రార్థన పిలుపు కోసం లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం ద్వారా.. ఇతర మతాలవారికి ఇబ్బంది కలిగిస్తోందంటూ ఓ వర్గం వాదిస్తోంది. ఈ అజాన్ శబ్ద కాలుష్యానికి దారి తీస్తోందని, అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందంటూ.. 2005 జులైలో సుప్రీంకోర్టు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్పీకర్ల వినియోగాన్ని (పబ్లిక్ ఎమెర్జెన్సీ సందర్భాల్లో మినహాయిస్తే) నిషేధించింది. అనంతరం 2005 అక్టోబర్‌లో.. ఏడాదిలో 15 రోజుల పాటు పండగ సందర్భాల్లో అర్థరాత్రి వరకు లౌడ్ స్పీకర్లను ఉపయోగించవచ్చని అనుమతి ఇచ్చింది. అటు.. ఇతర మతాల మనోభావాల్ని అజాన్ దెబ్బతీస్తోందని వేసిన పిల్‌ని గతేడాది విచారించిన కర్ణాటక హైకోర్టు.. అజాన్ విషయంలో మసీదులకు ఎలాంటి ఆదేశాల్ని జారీచేసేందుకు నిరాకరించింది. ఇతర మతాల ప్రాథమిక హక్కుల్ని అజాన్ ఉల్లంఘిస్తోందన్న వాదనను అంగీకరించలేమని పేర్కొంది.
kousalya : కొడుకు కోసం కష్టాలు పడ్డా.. ఇప్పుడు వాడు పెళ్లి చేసుకోమంటున్నాడు