Sikkim: సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న వాహనం గురువారం రాత్రి తీస్తా నదిలో పడిపోయింది. దాదాపుగా 1000 అడుగుల ఎత్తు నుంచి వాహనం పడిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా, 9 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో బీజేపీ లీడర్ ఇతి శ్రీ నాయక్ జెనా కూడా ఉన్నారు. వాహనం లాచెన్ నుంచి లాంచుంగ్ వెళ్తుండగా వాహనం మలుపు తిరిగే సమయంలో ప్రమాదం జరిగింది.
Read Also: MLA Vakiti Srihari: మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం.. ఇన్నోవా వాహనాన్ని ఢీకొన్న ఐ20 కార్
డ్రైవర్‌తో సహా 10 మందితో కూడిన వాహనం ఒడిశా, కోల్‌కతా నుంచి పర్యటకులతో వచ్చిన్నట్లు తెలుస్తోంది. మూలమలుపు వద్ద నియంత్రణ కోల్పోవడంతోనే వాహనం లోయలో పడి, వేగంగా ప్రవహించే తీస్తా నదిలో కొట్టుకుపోయింది. ఒకరి మృతదేహాన్ని వెలికి తీసినట్లు, మరొక పర్యాటకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం గ్యాంగ్‌టక్‌లోని ఆస్పత్రికి తరలించారు.
తప్పిపోయిన వారిలో ఒడిశాలోని బీజేపీ జాజ్‌పూర్ యూనిట్ జనరల్ సెక్రటరీ ఇతిశ్రీ నాయక్ జెనా కూడా ఉన్నారు. ఈ సంఘటన తర్వాత, భారత సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి), సిక్కిం పోలీసులు సంఘటనా స్థలం రాత్రంతా సహాయచర్యలు చేశారు. డైవర్లు, హై అల్టిట్యూడ్ రెస్క్యూ యూనిట్లను కూడా మోహరించారు.
