Assembly Elections 2022 war between BJP and Congress. BJP Candidates Lead In Goa Elections.
ఇటీవల దేశంలో జరిగిన 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైన నాటి నుంచి 5 రాష్ట్రాల ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే యూపీలో బీజేపీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. యూపీలో మ్యాజిక్ ఫిగర్ 202 కు బీజేపీ అభ్యర్థులు 205 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇది చూస్తుంటే యూపీలో మరోసారి బీజేపీ జెండా ఎగరడం ఖాయమని తెలుస్తోంది. అయితే గోవాలో కూడా ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింప ప్రక్రియ ప్రారంభమైంది.
అయితే ప్రారంభంలో బీజేపీ అభ్యర్థులే ముందంజలో ఉండగా.. ప్రస్తుతం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా కనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. బీజేపీ అభ్యర్థులు 19 స్థానాల్లో ముందంజలో ఉండగా, 14 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సత్తాచాటుతున్నారు. అయితే తృణమూల్‌తో పాటు ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అప్పుడే క్యాంప్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులను కాపాడుకునేందకు కాంగ్రెస్ బీజీబీజీ అయిపోయింది.
