BJP is leading in four seats in the by-elections: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా వెళ్తోంది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మునుగోడులో టీఆర్ఎస్ పార్టీతో నువ్వానేనా అన్న రీతిలో పోరాడుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది.
హర్యానాలోని అదామ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భవ్య బిష్ణోయ్ ఆరు రౌౌండ్లు ముగిసే సరికి 35,686 ఓట్ల లీడ్ లో ఉన్నారు. ఇక్కడ బీజేపీ విజయం దాదాపుగా ఖరారు అయింది. గతంలో ఈ అసెంబ్లీకి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా ఉన్న కుల్ దీప్ బిష్ణోయ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఈ ఎన్నికలు అనివార్యం అయ్యాయి.
Read Also: Munugode Bypoll Results: ఈసీకి కిషన్‌రెడ్డి, ఈటల ఫోన్లు.. అసలు ఏం జరుగుతోంది..?
ఇదిలా ఉంటే బీహార్ రాష్ట్రంలో మొకామా, గోపాల్ గంజ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొకామా సిట్టింగ్ ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్ పై అనర్హత వేటు పడటంతో ఈ ఎన్నికలు వచ్చాయి. ఇక గోపాల్ గంజ్ నియోజకవర్గంలో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మరణించడంతో ఉప ఎన్నిక జరగింది. ప్రస్తుతం జరుగుతన్న ఓట్ల లెక్కింపులో మొకామా నుంచి ఆర్జేడీ తరుపున పోటీ చేస్తున్న నీలమ్ దేవీ దాదాపుగా విజయం సాధించింది. అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలి ఉంది. ఇక గోపాల్ గంజ్ నియోజకవర్గంలో బీజేపీ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. అక్కడి అధికార జేడీయూ-ఆర్జేడీ కూటమికి పరాజయం తప్పేలా లేదు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కుసుమ్ దేవీ, ఆర్జేడీ అభ్యర్థి మోహన్ ప్రసాద్ గుప్తాపై 2360 ఓట్ల ఆధిక్యం కలిగి ఉన్నారు.
ఒడిశాలో ధామ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సూర్యవంశీ సూరజ్, బీజేడీ అభ్యర్థి అబంతీ దాస్ పై ఐదోరౌండ్ ముగిసే సరికి 3000 వేల పైచిలుకు ఓట్లు ఎక్కువగా సంపాదించాడు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గోల గోకరనాథ్ లో బీజేపీ నేత అమన్ గిరి, సమాజ్ వాదీ అభ్యర్థి వినయ్ తివారీ కన్నా 26,000 వేల ఓట్ల మెజారిటీలో ఉన్నారు. ఇక్కడ కూడా బీజేపీ విజయం దాదాపుగా ఖారారైంది.