Site icon NTV Telugu

BJP: టార్గెట్ 2024 ఎలక్షన్స్.. ఈ రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇంఛార్జులు వీరే…

Bjp

Bjp

BJP has appointed in-charges for many states: బీజేపీ 2024 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా సమాయత్తం అవుతోంది. ఇటీవల కేంద్ర మంత్రులతో సమావేశం అయిన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2024 ఎన్నికలపై సమాయత్తం కావాలని సూచించారు. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో అతి తక్కువ తేడాతో ఓడిపోయిన 144కు లోక్ సభ స్థానాలపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో వీటిల్లో గెలవాలని ప్లాన్ చేసుకున్నారు. మరోవైపు బీజేపీ ఆశలు పెట్టుకున్న రాష్ట్రాల్లో తరుచుగా కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు పర్యటిస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలే.

ఇదిలా ఉంటే బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి రెండేళ్ల ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే కొంతమంది కేంద్రమంత్రులను, ముఖ్యమంత్రులను పలు రాష్ట్రాలకు ఇంఛార్జులుగా నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది బీజేపీ పార్టీ. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పలువురు కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, కీలక నేతలకు వివిధ రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్, కేంద్ర మాజీ మంత్రులు ప్రకాశ్ జవదేకర్, మహేశ్ శర్మలకు రాష్ట్రాలను కేటాయించారు.

Read Also: Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్ 2 ఎన్నిసార్లు భారత్ పర్యటనకు వచ్చారో తెలుసా..?

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి పంజాబ్ రాష్ట్ర బాధ్యతలను అప్పగించారు. అలాగే త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్ కు హర్యానా బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు ప్రకాష్ జవదేకర్ ను కేరళకు ఇంఛార్జుగా నియమించారు. గతంలో బీహార్ బాధ్యతలు చూసిన పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకు హర్యానా బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. బీజేపీ సీనియర్ నేత ఓం మాథుర్ కి వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఛత్తీస్‌గఢ్‌ బాధ్యతలు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్‌ లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించి బీజేపీ అధికారంలోకి రావాాలని కోరుకుంటోంది.

బీహార్ మాజీ మంత్రి మంగళ్ పాండేకు పశ్చిమ బెంగాల్ బాధ్యతలు అప్పగించింది. పశ్చిమ బెంగాల్ లో మరో బీజేపీ నేత సునీల్ బన్సాల్ తో కలిసి ఆయన ఇంఛార్జి బాధ్యతలు నిర్వహించనున్నారు.  ఇక రాజస్థాన్ రాష్ట్రంలో అరుణ్ సింగ్, మధ్యప్రదశ్ లో మురళీధర్ రావులను ఇంఛార్జులుగా బీజేపీ కొనసాగిస్తోంది. లక్ష్మీకాంత్ వాజ్‌పేయి జార్ఖండ్ బాధ్యతలు చూడనున్నారు. త్రిపుర బాధ్యతలను మహేష్ వర్మ చూసుకోనున్నారు. బీజేపీ నేత సంబిత్ పాత్రకు ఈశాన్య రాష్ట్రాల సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు.

 

Exit mobile version