NTV Telugu Site icon

BJP: జాతీయ పార్టీల నిధుల్లో సగానికి పైగా బీజేపీకే.. వెల్లడించిన ఎన్నికల సంఘం..

Bjp

Bjp

BJP: జాతీయ పార్టీల నిధుల్లో బీజేపీ టాప్ లో నిలిచింది. ఏకంగా సగానికి పైగా నిధులు ఒక్క భారతీయ జనతా పార్టీకే వచ్చాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం.. 2020-21లో అన్ని జాతీయ పార్టీల మొత్తం నిధుల్లో 58 శాతం నిధులు బీజేపీకి వచ్చాయి. 2021-22లో నాలుగు జాతీయ పార్టీలు తమ మొత్తం ఆదాయంలో 55.09 శాతాన్ని ఎలక్టోరల్ బాండ్ల విరాళాల ద్వారా సేకరించాయి.

Read Also: Allu Arjun: పుష్ప 2 ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్, దేశముదురు రీరిలీజ్… అన్నీ ఒకటే రోజు

నాలుగు జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, త్రుణమూల్ కాంగ్రెస్ తమ మొత్తం ఆదాయంలో 55.09 శాతం (రూ. 1811.94 కోట్లు)ను ఎలక్టోరల్ బాండ్ల విరాళాల ద్వారా సేకరించాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. 2021-22లో బీజేపీ మొత్తం ఆదాయం రూ. 1917.12 కోట్లుగా ప్రకటించింది. అయితే ఇది మొత్తం ఆదాయంలో 44.57 శాతం( రూ. 854.46 కోట్లు)ను మాత్రమే ఖర్చు చేసింది. త్రుణమూల్ కాంగ్రెస్ మొత్తం ఆదాయంలో రూ. 545.745 కోట్లు కాగా.. ఆ పార్టీ రూ. 268.337 కోట్లు ఖర్చు చేసింది. త్రుణమూల్ కాంగ్రెస్ మొత్తం ఖర్చు ఈ ఏడాదిలో 49.17 శాతంగా ఉంది. కాంగ్రెస్ మొత్తం ఆదాయం రూ. 541.245 కోట్లు కాగా.. పార్టీ తన ఆదాయంలో 73.98 శాతం రూ. 400.414 కోట్లు ఖర్చు చేసింది.

2019-20లో విక్రయించిన పోల్ బాండ్లలో బీజేపీకి 76 శాతం వస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం 9 శాతం మాత్రమే వచ్చాయి. మొత్తం 8 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ). నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఎం), ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) పార్టీలు దేశం నలుమూలల నుంచి సేకరించిన ఫండ్స్ ద్వారా రూ. 3289.34 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి. బీజేపీ అన్ని జాతీయ పార్టీతో పోలిస్తే 2021-22లో రూ. 1917.12 కోట్ల ఆదాయాన్ని కలిగి ఉంది. ఇది మొత్తం 8 జాతీయ పార్టీల ఆదాయంలో 58.28 శాతం. త్రుణమూల్ కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది.

Show comments