Site icon NTV Telugu

‘Shakti’ remarks: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

Rahul Gandhi

Rahul Gandhi

‘Shakti’ remarks: ఇటీవల ముంబై వేదికగా జరిగిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇండియా కూటమి నేతలు హాజరైన ఈ మెగా ఈవెంట్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల(ఈవీఎం)లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు బుధవారం బీజేపీ ఫిర్యాదు చేసింది.

Read Also: Bihar: బీహార్ కాంగ్రెస్‌లో జోష్.. హస్తం గూటికి పప్పు యాదవ్

ఫిబ్రవరి 17న ముంబైలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘హిందూ మతంలో శక్తి అనే పదం ఉంది. మేము ఒక శక్తికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము’’ అని వ్యాఖ్యలు చేశారు. ‘‘శక్తి ఏంటంటే.. ఈవీఎంలో రాజుగారి ఆత్మ ఉంది. రాజు ఆత్మ ఈవీఎంలతో పాటు దేశంలోని ప్రతీ సంస్థలో ఈడీ, సీబీఐ, ఐటీలో ఉంది’’ ఈవీఎంలు లేకుండా ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల్లో గెలవలేరని కాంగ్రెస్ నేత ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.

కాంగ్రెస్, ఇండియా కూటమికి హిందువులు, హిందూ ధర్మం అన్నా లెక్కలేదని, వారు హిందువులను అవమానించేందు ఎలాంటి అవకాశాన్ని కూడా వదలడం లేదని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు. నిన్న తమిళనాడులో పర్యటించిన ఆయన డీఎంకే, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. మధుర మీనాక్షి, కంచి కామాక్షి తమిళనాడులో శక్తి స్వరూపాలని, శక్తిని ధ్వంసం చేస్తామని కాంగ్రెస్, డీఎంకే కూటమి అంటున్నాయని, హిందూ మతంలో శక్తి అంటే మాతాశక్తి, నారీ శక్తి అని ప్రధాని అన్నారు. ఇండి కూటమి మహిళల విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో అందరూ చూస్తున్నారని ఆయన అన్నారు. మహిళల పట్ల ఇండియా కూటమి వ్యవహరించే శైలికి మీ అందరూ సాక్ష్యమని, రాష్ట్ర మాజీ సీఎం జయలలిత జీవించి ఉన్నప్పుడు డీఎంకే నాయకులు ఆమెతో ఎలా ప్రవర్తించారో అందరీ తెలుసని, ఇది డీఎంకే అసలు రూపమని ఆయన అన్నారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు నాణేనికి రెండు వైపులని ప్రధాని ఆరోపించారు.

Exit mobile version