హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసింది. 67 మందితో కూడిన తొలి జాబితాను బుధవారం సాయంత్రం బీజేపీ ప్రకటించిండి. ముఖ్యమంత్రి నయాబ్ సైనీ లాడ్వా నుంచి పోటీ చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Haryana: బెడిసికొట్టిన ఆప్-కాంగ్రెస్ పొత్తు!.. సీట్ల పంపకాలపై తెగని పంచాయితీ
హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఎన్డీఏ-ఇండియా కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. అధికారం దక్కించుకోవాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తుంది. అయితే ఇండియా కూటమిలో పార్టీల మధ్య సీట్లు పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి. చర్చలు కొలిక్కి వచ్చాక తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించనుంది. ఇక భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాకు అవకాశం కల్పించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Viral : వరదల సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 30 మంది అధికారులకు మరణశిక్ష
హర్యానాలో మొత్తం 90 నియోజకవర్గాల్లో 67 స్థానాలకు బీజేపీ పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో లాడ్వా నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి అనిల్ విజ్ పేరు కూడా ఉంది.
2009 నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి విజ్ బరిలోకి దిగనున్నారు. ఇక ఈ ఏడాది మార్చిలో మనోహర్ లాల్ ఖట్టర్‌ను హర్యానా ముఖ్యమంత్రిగా నియమించే వరకు కురుక్షేత్ర ఎంపీగా ఉన్న సైనీ… ప్రస్తుతం కర్నాల్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జూన్‌లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన విజయం సాధించారు.