త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అయితే ఈలోపే బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. బీహార్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే కొత్త అధ్యక్షుడిని నియమించాలని హైకమాండ్ భావిస్తున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తికానున్నాయి. అనంతరం బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకాన్ని కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి ధన్‌ఖర్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే..! వెలుగులోకి సమాచారం
ప్రస్తుతం జేడీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పలుమార్లు పదవీకాలం పొడిగింపబడింది. దీంతో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని ఆలోచన కలిగి ఉంది. అంతకంటే ముందే ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక వంటి కీలక రాష్ట్రాల్లో కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ మండలి సభ్యుడిగా.. గుజరాత్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికవుతారు. అనంతరం కొత్త అధ్యక్షుడి నామినేషన్ పత్రాలకు ప్రతిపాదకులుగా వ్యవహరించడానికి వీరిద్దరూ అర్హులు అవుతారు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. పెరిగిన పసిడి ధరలు
అయితే కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక కుల, ప్రాంతీయ లేదా సామాజిక సమీకరణాల ఆధారంగా జరగకూడదని పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. పార్టీని బలోపేతం చేసే వ్యక్తిని మాత్రమే ఎంపిక చేయనున్నట్లు సమాచారం. జాతీయ స్థాయిలో సంస్థాగతంగా మంచి అనుభవం ఉన్న సీనియర్ నేతకు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
