NTV Telugu Site icon

Manish Sisodia: రామాయణంలో మాయ లేడి లాంటి బీజేపీ నేతలను చూసి మోసపోవద్దు!

Manish Sisodia

Manish Sisodia

Manish Sisodia: దేశ రాజధానిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార, విపక్ష పార్టీలైన ఆప్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో రామాయణంలో మాయ లేడి లాంటి బీజేపీ నేతలను చూసి మోసపోవద్దని ఆప్ సినీయర్ నేత మనీశ్‌ సిసోడియా తెలిపారు. కేజ్రీవాల్‌ వ్యాఖ్యలకు రావణాసురుడి వారసులు తక్షణమే స్పందించారని ఎద్దేవా చేశారు.

Read Also: Vinayakan: మందేసి రెచ్చిపోయిన జైలర్ విలన్.. చివరికి క్షమాపణలు !

అయితే, సోమవారం నాడు అరవింద్ కేజ్రీవాల్‌ ఓ బహిరంగ సభలో రావణుడికి సంబంధించిన కామెంట్స్ చేశారు. అందులో, రావణుడి వారసులు (బీజేపీ నేతలు) ఈ నా వ్యాఖ్యలపై తక్షణమే స్పందించారని పేర్కొన్నాడు. వారి అసలు ఉద్దేశం ఢిల్లీ ప్రజలు గ్రహించాలని చెప్పుకొచ్చాడు. వారు రాష్ట్ర ప్రజలకు రావణాసురుడి కంటే పెద్ద ప్రమాదంగా మారతారని విమర్శించారు. బీజేపీతో జాగ్రత్తగా ఉండాలి.. ఒకవేళా, ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆ తర్వాత మురికివాడ ప్రజల భూములన్నీ అమ్మేస్తుందని ఆరోపించారు. కాబట్టి, ప్రజలు జాగ్రత్తగా ఉండి.. సరైన నిర్ణయాలు తీసుకోవాలని మనీశ్ సిసోడియా వెల్లడించారు.