BJP criticizes Mallikarjuna Kharge’s ‘Ravan’ comments: మరికొన్ని రోజుల్లో గుజరాత్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగబోతోంది. ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీని రావణుడితో పోలుస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ విరుచుకుపడుతోంది. ఖర్గే ‘ గుజరాత్ పుత్రుడిని అవమానిస్తున్నారు’ అంటూ బీజేపీ ఆరోపించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Rishi Sunak: భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి రెడీ.. చైనాతో స్వర్ణయుగం ముగిసినట్టే..
మోదీ జీ ప్రధాని.. ఆయన తన పని మరిచిపోయి కార్పొరేషన్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు ఇలా ప్రతీ చోట ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడూ తన గురించే మాట్లాడుకుంటున్నారు.. ఆయన పేరుతో ఓట్లు అడుగుతున్నారు. ఎన్నిసార్లు ప్రధాని మోదీ ముఖం చూడాలి.. ఆయనకు రావణుడిలా 100 తలలు ఉన్నాయా..? అంటూ ఖర్గే ప్రశ్నించారు.
మున్సిపాలిటీ ఎన్నికలు అయినా.. కార్పొరేషన్ ఎన్నికలు అయినా.. రాష్ట్ర ఎన్నికలు అయినా సరే.. మోదీ పేరుతో ఓట్లు అడగటం నేను చూస్తూనే ఉన్నాను.. అభ్యర్థి పేరుతో ఓట్లు అడగండి.. మోదీ వచ్చి మున్సిపాలిటీకి పనిచేస్తారా.?? మీకు అవసరమైన సమయంలో మోదీ మీకు సహాయం చేస్తాడా..? అంటూ ప్రజలను ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందించారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీని తట్టుకోలేకే కాంగ్రెస్ అధ్యక్షుడు ఇలాంటి నియంత్రణ లేని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ‘‘ మౌత్ కా సౌదాగర్’’(మరణాల వ్యాపారి), ‘‘రావణ్’’ అంటూ ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తూనే ఉందని ఆయన మండిపడ్డారు. డిసెంబర్ 1,5న రెండు విడతల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్ ఫలితాలతో పాటు గుజరాత్ ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
