NTV Telugu Site icon

Waqf Bill: ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్.. రేపు పార్లమెంట్‌లో “వక్ఫ్ బిల్లు”..

Waqf Amendment Bill

Waqf Amendment Bill

Waqf Bill: ప్రతిష్టాత్మక ‘‘వక్ఫ్ సవరణ బిల్లు’’ రేపు పార్లమెంట్ ముందుకు రాబోతోంది. రేపు మధ్యాహ్నం ముందుగా లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టి, చర్చించనున్నారు. ఆ తర్వాత రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమైంది. అయితే, ఈ బిల్లును కాంగ్రెస్, ఎస్పీ, టీఎంసీ, ఎంఐఎం వంటి ఇతర పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బిల్లును అడ్డుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

Read Also: Xi Jinping: “డ్రాగన్-ఏనుగు కలిసి డ్యాన్స్ చేయాలి”.. భారత్‌కి జిన్‌పింగ్ స్నేహహస్తం..

ఇదిలా ఉంటే, కీలక బిల్లు ప్రవేశపెడుతుండటంతో తమ తమ ఎంపీలు సభకు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ, కాంగ్రెస్ విప్ జారీ చేశాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు సభకు ఖచ్చితంగా రావాలని ఆదేశించాయి. ప్రస్తుతం రెండు సభల్లో అధికార ఎన్డీయే పార్టీకి ఫుల్ మెజారిటీ ఉంది. లోక్‌సభలో వక్ఫ్ బిల్లుకు  298 మంది ఎంపీల మద్దతు ఉంది, వ్యతిరేకంగా 233 మంది ఉన్నారు. తటస్థంగా 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇక రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా 122 మంది ఎన్డీయే సభ్యుల మద్దతు ఉండగా, వ్యతిరేకంగా ఇండీ కూటమికి చెందిన 116 మంది ఎంపీలు ఉన్నారు.