Site icon NTV Telugu

I Love Manish Sisodia: జైలుకు వెళ్లిన సిసోడియాకు పిల్లలతో మద్దతు.. ఆప్‌పై బీజేపీ ఆరోపణలు

Delhi Liquor Scam,

Delhi Liquor Scam,

Manish Sisodia Arrest: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియాను సీబీఐ ఇటీవల అరెస్ట్ చేసింది. ఈ చర్యను ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఖండిస్తోంది. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఒత్తడి వల్లే సీబీఐ తప్పుడు అభియోగాలతో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసిందని ఆప్ నేతలు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆప్ , ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో పిల్లలతో మనీష్ సిసోడియాకు మద్దతు తెలిపే ప్లాన్ కు శ్రీకారం చుట్టిందని బీజేపీ ఆరోపించింది. ‘‘ఐ లవ్ మనీష్ సిసోడియా’’ అనే స్పెషల్ డెస్క్ ను ఆప్ ప్రభుత్వం పాఠశాలల్లో ఏర్పాటు చేసిందని విమర్శించింది.

Read Also: Rohini: పవన్ కళ్యాణ్ గురించి రఘువరన్ అలా చెప్పగానే షాక్ అయ్యా..

అయితే అలాంటిదేం లేదని ఆప్, బీజేపీ ఆరోపణలను ఖండిస్తోంది. ఇది కేవలం బీజేపీ ఎజెండా అంటూ మండిపడింది. అయితే పలువురు ఆప్ నేతలు పాఠశాల విద్యార్థులు మనీష్ సిసోడియాకు మద్దతుగా ప్లకార్డులను ప్రదర్శించడాన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. మనీష్ అంకుల్ ను మిస్ అవుతున్నాం అంటూ చిన్నారులు ప్లకార్డులు పట్టుకోవడం ఇందులో కనిపిస్తోంది. త్వరలో క్యాబినెట్ లో చేరబోతున్న ఆప్ ఎమ్మెల్యే అతిషి విద్యార్థులు మనీష్ సిసోడియాకు మద్దతు తెలుపుతున్న ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. బీజేపీ వాళ్లు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా.. ఢిల్లీ పిల్లలకు మనీష్ సిసోడియాపై ఉన్న ప్రేమను మీరు తుడిచివేయలేరని కామెంట్ చేశారు.

ఇదిలా ఉంటే ఈ చర్యలపై బీజేపీ మండిపడుతోంది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని పరిమితులను అతిక్రమిస్తోందని, అమాయకపు పాఠశాల పిల్లలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ ప్రచారాన్ని ఆపాలని కోరారు. సిసోడియా కోసం ఇలాంటి సందేశాలు రాయాలని తల్లిదండ్రులను ఆప్ ఒత్తడి చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆప్ ఇలాంటి డర్టీ రాజకీయాలకు తెరలేపుతోందని బీజేపీ విమర్శించింది.

Exit mobile version