దేశంలోని ఖాళీగా ఉన్న 57 రాజ్యసభ స్థానాలకు బీజేపీ ఆదివారం నాడు తన తొలి జాబితాను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఆ పార్టీ బరిలో దించుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. మరో కేంద్రమంత్రి పియూష్ గోయల్‌కు మహారాష్ట్ర నుంచి అవకాశం కల్పించారు. రాజ్యసభలో ఖాళీ అయిన 57 స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి.
కర్ణాటక నుంచి జగ్గేష్, మహారాష్ట్ర నుంచి అనిల్ సుఖ్‌దేవ్ రావ్ బోండే, మధ్య ప్రదేశ్ నుంచి కవితా పాటిదార్, రాజస్థాన్ నుంచి ఘనశ్యామ్ తివారీ, ఉత్తరప్రదేశ్ నుంచి లక్ష్మీకాంత్ వాజ్ పేయి, యూపీ నుంచి రాధామోహన్ అగర్వాల్, యూపీ నుంచి సురేంద్ర సింగ్ నాగర్, యూపీ నుంచి బాబూరామ్ నిషాద్, యూపీ నుంచి దర్శనా సింగ్, యూపీ నుంచి సంగీతా యాదవ్, ఉత్తరాఖండ్ నుంచి కల్పనా సైనీ, బీహార్ నుంచి సతీష్ చంద్ర దూబే, బీహార్ నుంచి శంభుశరణ్ పటేల్, హర్యానా నుంచి క్రిషన్‌లాల్ పన్వర్ బరిలో నిలిచారు.