Site icon NTV Telugu

పూణేలో వింత ఘ‌ట‌న‌… డ్రైవ‌ర్ లేకుండానే దూసుకెళ్లిన బైక్‌…

పూణేలో వింతఘ‌ట‌ల చోటుచేసుకుంది.  డ్రైవ‌ర్ లేకుండానే ఓ బైక్ దాదాపుగా 300 మీట‌ర్లు ప్ర‌యాణం చేసింది.  వేగంగా వ‌స్తున్న బైక్ రోడ్డుపై న‌డుస్తున్న పాద‌చారుడిని డీకొట్టింది.  బైక్ న‌డుపుతున్న వ్య‌క్తి కింద‌ప‌డిన‌ప్ప‌టికీ ఆ బైక్ మాత్రం ఆగ‌లేదు.  300 మీట‌ర్ల‌మేర రోడ్డుపై ప్రయాణం చేసి ఎదురుగా వ‌స్తున్న మినీ లారీకి తగిలి కింద‌ప‌డింది.  దీనికి సంబందించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.  సీసీకెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Read: విశాఖ పోలీసుల కీల‌క నిర్ణ‌యం: సాయంత్రం 5 త‌రువాత బీచ్‌లో క‌నిపిస్తే…

Exit mobile version