Site icon NTV Telugu

ఒకే మ‌హిళ‌కు 5 నిమిషాల వ్య‌వ‌ధిలో… రెండు వ్యాక్సిన్లు…

క‌రోనా మ‌హమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకోచ్చిన సంగ‌తి తెలిసిందే.  వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  ఇక ఇదిలా ఉంటే, బీహార్‌లోని ఓ మ‌హిళ‌కు అనుకోకుండా ఐదు నిమిషాల వ్య‌వ‌ధిలో కోవాగ్జిన్‌, కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ల‌ను ఇచ్చారు.  వెంట‌నే త‌ప్పు తెలుసుకొని, మ‌హిళ‌ను అబ్జ‌ర్వేష‌న్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు.  ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు.  పాట్నాలోని పుపున్ బ్లాక్ టౌన్‌కు చెందిన సునీలా దేవి అనే మ‌హిళ వ్యాక్సినేష‌న్ కోసం వ్యాక్సినేష‌న్ సెంట‌ర్‌లో నిలుచుంది.

Read: ‘సయ్యా జీ’ అంటూ ‘సింగిల్’గా 400 మిలియన్ల మందిని ఫిదా చేసిన నుస్రత్!

మ‌హిళ‌కు మొద‌ట కోవాగ్జిన్ వ్యాక్సిన్ అందించారు.  అనంత‌రం, ఆ మ‌హిళ రెండో క్యూలో నిల‌బ‌డింది.  అలా నిల‌బ‌డిన మ‌హిళ‌కు కోవీషీల్డ్ వ్యాక్సిన్ అందించారు.  ఐదు నిమిషాల వ్య‌వ‌ధిలో రెండు వ్యాక్సిన్లు ఇవ్వ‌డంతో వైద్యులు షాక్ అయ్యారు.  వెంట‌నే సునీలా దేవిని అబ్జ‌ర్వేష‌న్ సెంట‌ర్‌కు త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు.  ప్ర‌స్తుతం మ‌హిళ ఆరోగ్యం కుదురుగానే ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. 

Exit mobile version