Site icon NTV Telugu

Bihar: కన్హయ్య కుమార్ సందర్శన తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసిన యువకులు

Kanhaiyakumar

Kanhaiyakumar

కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్‌కు బీహార్‌లో చేదు అనుభవం ఎదురైంది. పర్యటనలో భాగంగా సహర్సా జిల్లాలోని బంగావ్‌ గ్రామంలో దుర్గా ఆలయాన్ని కన్హయ్య కుమార్ సందర్శించారు. ‘పలయన్ రోకో, నౌక్రీ దో’ పాదయాత్ర సందర్భంగా ఆలయాన్ని సందర్శించారు. ఆలయ సందర్శన అనంతరం స్థానిక యువకులు గంగా జలం తీసుకొచ్చి శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ వ్యవహారం వివాదంగా మారింది. ఈ ఘటన రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసింది.

ఇది కూడా చదవండి: Vice MPP Election: దంపతుల మధ్య చిచ్చు పెట్టిన వైస్ ఎంపీపీ ఎన్నిక.. పుట్టింటికి వెళ్లిపోయిన భార్య..!

అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి జ్ఞాన్ రంజన్ గుప్తా స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మద్దతుదారులే భక్తిపరులా?… మిగిలిన వారంతా అంటరానివారా? ఈ విషయం గురించి తాము తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. కొత్త సంస్కృతిని బీజేపీ ప్రవేశపెడుతుందా? అని ప్రశ్నించారు. ఈ చర్య పరశురాముడి వారసులను అగౌరవపరిచిందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Beer Consumption: ఎండలు మండుతున్నాయని.. బీర్లు ఎక్కువగా తాగుతున్నారా?

కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ అధికార ప్రతినిధి అసిత్ నాథ్ తివారీ తోసిపుచ్చారు. కన్హయ్య కుమార్ విధానాన్ని నిరసిస్తూ ఆ విధంగా చేసి ఉంటారని చెప్పుకొచ్చారు. అంతేతప్ప అందులో వేరే ఉద్దేశం ఏమీలేదన్నారు. కన్హయ్య కుమార్ వ్యవహార శైలికి నిరసనగా అలా చేసి ఉంటారని వివరణ ఇచ్చారు.

 

Exit mobile version