Site icon NTV Telugu

Government of Bihar: పొలాల్లో ఆ..పనిచేస్తే సహించేది లేదు

Government Of Bihar

Government Of Bihar

Government of Bihar: వరికి మద్దతు ధర కోసం అనేక రాష్ట్రాల్లో నిరసనలు, ఉద్యమాలు జరుగుతున్నాయి. అన్నదాతలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఛాలెంజ్‌తో పాటు వరి గడ్డిని కాల్చడం కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు మరో పెద్ద సవాలుగా మారింది. అలా చేయడం వల్ల వాతావరణం కలుషితం అవుతోందని చెప్పినా వినడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్, హర్యానాలలో వరి పంటలు పండిన తర్వాత… పొలాల్లో గడ్డి తగలబడి ఢిల్లీ ఎంత ఉక్కిరిబిక్కిరి అవుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో..బీహార్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. “మేము పంట పొలాల్లో గడ్డిని కాల్చము” అని రైతులు లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఖరీఫ్ సమావేశంలో భాగంగా ధాన్యం పండించే, విక్రయించే రైతులందరికీ కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు. గడ్డిని కాల్చివేయాలని, ఆ నిబంధన పాటించాలని రైతులకు ఖచ్చితంగా చెబితేనే వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సహకార శాఖ వెల్లడించింది. ఈ మేరకు బీహార్‌లోని అన్ని జిల్లాల మెజిస్ట్రేట్‌లకు ప్రభుత్వం ఉత్తర్వులు పంపింది. ఏ రైతు కూడా పంట పొలాల్లో గడ్డిని కాల్చకూడదని నిర్ణయించుకుంది. ఇందుకోసం జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

Read also: Navjeevan Express Fire Accident: నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటలు

ఇదంతా చెప్పిన తర్వాత మరోసారి రైతులు ఇలాగే ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రస్తుత సమాచారం ప్రకారం… బీహార్‌లో పాట్నా, భేజ్‌పూర్, నలంద, బక్సర్, రోహ్‌తాస్, కైమూర్ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా గడ్డిని తగలబెడుతున్నారు. 83% కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. హర్యానా ప్రభుత్వం…కనీస మద్దతు ధర ఇచ్చి రైతుల నుంచి గడ్డి కొనుగోలు చేయాలని చూస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. హర్యానా వ్యవసాయ శాఖ మంత్రి జేపీ దలాల్ కూడా ఈ మేరకు ప్రకటన చేశారు. రైతుల నుంచి గడ్డి కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కమిటీని నియమించిన ప్రభుత్వం… సభ్యుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుంది. ఆ సూచనల మేరకు గడ్డిని పారవేసే పద్ధతులపై మేధోమథనం చేస్తున్నారు. వీటికి ఎంత మద్దతు ధర ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. దీంతో పాటు రైతుల్లో అవగాహన పెంచేందుకు హర్యానా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 80 వేల సూపర్ సీడర్ యంత్రాలను రైతులకు అందజేశారు. పంట పొలాల్లో గడ్డిని కాల్చకూడదని చెబుతోంది. ఈ నిబంధనను పాటించే రైతులకు హెక్టారుకు రూ.1000 చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేస్తారు. ఈ చర్యలతో హర్యానాలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి “గడ్డి కాల్చుతున్న” ఘటనలు తగ్గాయి.
Vikram-S: నేడు విక్రమ్-ఎస్ రాకెట్ లాంచ్.. తొలి స్వదేశీ ప్రైవేట్ రాకెట్‌గా గుర్తింపు

Exit mobile version