Bihar MLA Anant Singh: బీహార్ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. 50 లక్షల గులాబ్ జామూన్లు, విజేతకు థార్ కారు!

  • దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన బీహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె వివాహం..
  • 50 లక్షల గులాబ్ జామూన్, 10 వేల లీటర్లు పాటు, గుర్రాల రేసు..
Bihar Mla Anant Singh (1)

Bihar Mla Anant Singh (1)

Bihar MLA Anant Singh: బీహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె వివాహం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అంగరంగ వైభవంలో వందల కోట్లు ఖర్చు చేసి కూతురు పెళ్లి జరిపిస్తున్నాడు. ‘ఛోటే సర్కార్’గా పిలిచే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి వివాహం నవంబర్ 25న జరగనుంది. దీని కోసం మొకామాలోని నద్వాన్ గ్రామంలో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి . సుమారు 10 ఎకరాల భూమిలో ఒక భారీ పందిరిని నిర్మిస్తున్నారు. కమాండెంట్ రణ్‌విజయ్ కుమార్ కుమారుడు రిషికేశ్ కుమార్‌తో శివాంగి వివాహం జరగనుంది.

అతిథుల కోసం ఏకంగా 50 లక్షల గులాబ్ జామూన్లు సిద్ధం చేశారు. భారీ టెంట్లు, గుర్రాల రేసు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. గుర్రాల రేసు కోసం బీహార్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ నుంచి 20కి పైగా గుర్రాలు నద్వాన్ గ్రామానికి చేరుకున్నాయి. విజేతకు థార్ కారును బహుమతిగా ఇవ్వనున్నారు. భారీ టెంట్లు, వంటశాలలు, హెలిప్యాడ్లు, ఇలా ఈ పెళ్లి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అతిథుల కోసం మరో 12 టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో రాబోయే అతిథుల కోసం 10,000 లీటర్ల పాలను ఉపయోగించి స్వీట్లు తయారీ చేస్తున్నారు.