Site icon NTV Telugu

Warning to Drinkers: తాగుబోతుల పరువు హుష్‌కాకి.. 52 వేల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్న ప్రభుత్వం

Bihar Government

Bihar Government

Warning to Drinkers:  2016లో బీహార్ ప్రభుత్వం మద్యపానంపై నిషేధం విధించింది. ఈ ప్రకారం ఆ రాష్ట్రంలో మద్యం తయారు చేయడం, విక్రయించడం, సేవించటం నేరం. ఈ మేరకు సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రజల్లో మార్పు తెచ్చేందుకు బీహార్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మందుబాబులను హెచ్చరిస్తూ వారి ఇళ్లకు పోస్టర్లు అంటిస్తోంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాలలో డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో పట్టుబడితే జరిమానా విధించడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తారు. కానీ బీహార్‌లో మాత్రం తాగుబోతులు సిగ్గుపడేలా ప్రభుత్వం ఊరంతా పోస్టర్లు అంటించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తొలిసారి పట్టుబడితే అంతే సంగతులు. 2022 ఏప్రిల్ నుంచి గోపాల్ గంజ్ జిల్లాలో పట్టుబడిన మందుబాబుల ఇళ్లకు అధికారులు పోస్టర్లు అందిస్తున్నారు.

Read Also: డెంగీ రోగులకు ఈ ఆహారం అమృతమే..

గతంలో మందు తాగి తొలిసారి దొరికిన వారు జరిమానాతో తప్పించుకునేవారు అని.. ఆ సంగతి చుట్టుపక్కల వాళ్లు, బంధువులకు తెలిసేది కాదని అబ్కారీ శాఖ అధికారి రాకేష్ కుమార్ అన్నారు. అందుకే 2022 ఏప్రిల్​ నుంచి మందు తాగుతూ దొరికిన వాళ్ల ఇళ్లకు పోస్టర్లు అంటిస్తున్నామని తెలిపారు. అలా చేస్తే ఆ వ్యక్తి తాగుతున్నారని అందరికీ తెలుస్తుందని తమ ప్రయోగం వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించారు. ఇందులో భాగంగానే గోపాల్ గంజ్ జిల్లాలోని 52వేల ఇళ్లకు అధికారులు మందుబాబుల పోస్టర్లు అంటిస్తున్నారు. కాగా అంతకుముందు తాగి నేరానికి పాల్పడితే ఆస్తుల స్వాధీనం, జీవిత ఖైదు శిక్షలు ఖరారు చేశారు. అయితే 2018లో లిక్కర్​ బ్యాన్​ చట్టానికి బీహార్ ప్రభుత్వం సవరణలు చేసింది. శిక్షల నుంచి ఉపశమనం కలిగించింది. దీంతో మళ్లీ మందుబాబులు రెచ్చిపోతుండటంతో తాజాగా వాళ్ల పరువు తీసేలా చర్యలు చేపట్టింది.

Exit mobile version