Site icon NTV Telugu

Patna: కూతురిపై తండ్రి అఘాయిత్యం.. వీడియో తీసి..

Father Molested Daughter Bihar

Father Molested Daughter Bihar

పాట్నాలో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే, కామంతో కళ్ళు మూసుకుపోయి కూతురిపై అత్యాచారానికి తెగబడ్డాడు. తండ్రి పెట్టే హింసల్ని తాళ్ళలేక, ఆ వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తనని కాపాడని పోలీసుల్ని వేడుకుంది. పోలీసులకు ఆ వీడియో చేరడంతో, వెంటనే రంగంలోకి దిగి నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

బీహార్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నిందితుడు(50) సమస్తిపూర్‌లోని రోసెరా ప్రాంతంలో తన 18 ఏళ్ళ కూతురితో ఉంటున్నాడు. వృత్తి రీత్యా టీచర్ అయిన నిందితుడు.. కొన్ని రోజులగా కూతుర్ని లైంగికంగా వేధిస్తున్నాడు. ఒకట్రెండు సార్లు కాదు.. పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లికి తెలిసినప్పటికీ, ఎవ్వరికీ చెప్పొద్దని ఆమెపై మామ ఒత్తిడి చేశాడు. అయితే, తండ్రి ప్రవర్తనతో విసుగు చెందిన ఆ అమ్మాయి, ఎలాగైనా తండ్రి బండారాన్ని బయటపెట్టాలని నిర్ణయించుకుంది. ఓరోజు సీక్రెట్ కెమెరా ద్వారా ఆ వ్యవహారాన్ని తీసింది.

ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తండ్రి నుంచి తనకు ప్రాణ భయం ఉందని, తనను రక్షించాలని పోలీసుల్ని ఆశ్రయించింది. వీడియో వైరల్ అవ్వడంతో, పోలీసులు వెంటనే స్పందించారు. కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామని రోసారా డీఎస్పీ సహియార్‌ అక్తర్‌ చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Exit mobile version