NTV Telugu Site icon

Bihar: కూతురును చంపించేందుకు మాజీ ఎమ్మెల్యే ప్లాన్.. కాంట్రాక్ట్ కిల్లర్ తో ఒప్పందం

Bihar Patna

Bihar Patna

బీహార్ లో పరువు హత్యకు స్కెచ్ వేశాడు ఓ మాజీ ఎమ్మెల్యే. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. అది కూడా వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని సొంత కూతురునే హతమార్చేందుకు ప్రయత్నించాడు. తన కూతురును చంపేలా కాంట్రాక్ట్ కిల్లర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాధ్యతయుతమైన ఎమ్మెల్యే పదవిని నిర్వహించిన వ్యక్తి అయి ఉండీ..పరువు హత్యకు ప్రయత్నించాడు. కాంట్రాక్ట్ కిల్లర్ పోలీసుల ముందు గుట్టు విప్పడంతో సదరు ఎమ్మెల్యే క్రిమినల్ చర్య గురించి తెలిసింది.

తనను కాదని..వేరే కులం వ్యక్తిన పెళ్లాడిందని సొంత కూతురును చంపేందుకు రూ. 20 లక్షలతో కాంట్రాక్ట్ కిల్లర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు మాజీ ఎమ్మెల్యే సురేంద్ర శర్మ. ఈ ఒప్పందంలో భాగంగానే ఇటీవల జూలై 1-2 అర్థరాత్రి ఎమ్మెల్యే కూతురుపై హత్యాప్రయత్నం జరిగింది. పాట్నాలోని శ్రీ కృష్ణ పురి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు తనమపై కాల్పులు జరిపారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read Also: Bandi Sanjay: కేసీఆర్ ఎవ‌రు? కోన్ కిస్కా.. బండి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

అయితే విచారణ జరిపిన పోలీసులు కాంట్రాక్ట్ కిల్లర్ ను పట్టుకుని విచారించిన సమయంలో మాజీ ఎమ్మెల్యే సురేంద్ర శర్మ పేరును వెల్లడించారు. దీంతో పాట్నా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. కాంట్రాక్ట్ కిల్లర్ అభిషేక్ అలియాస్ ఛోటే సర్కార్ తో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి మూడు దేశీయ పిస్టల్స్, కొన్ని రౌండ్ల బుల్లెట్స్, నంబర్ ప్లేట్ లేని మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు. 1990 దశకంలో సురేంద్ర శర్మ తన స్వస్థలమైన సరన్ జిల్లా నుంచి శాసనసభకు ఎమ్మెల్యేగా పనిచేశారు. అతనికి ఎలాంటి పార్టీతో సంబంధం లేదని, ఇండిపెండెంట్ గా గెలిచారని పోలీసులు వెల్లడించారు.

Show comments