బీహార్ లో పరువు హత్యకు స్కెచ్ వేశాడు ఓ మాజీ ఎమ్మెల్యే. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. అది కూడా వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని సొంత కూతురునే హతమార్చేందుకు ప్రయత్నించాడు. తన కూతురును చంపేలా కాంట్రాక్ట్ కిల్లర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బాధ్యతయుతమైన ఎమ్మెల్యే పదవిని నిర్వహించిన వ్యక్తి అయి ఉండీ..పరువు హత్యకు ప్రయత్నించాడు. కాంట్రాక్ట్ కిల్లర్ పోలీసుల ముందు గుట్టు విప్పడంతో సదరు ఎమ్మెల్యే క్రిమినల్ చర్య గురించి తెలిసింది.…