Site icon NTV Telugu

Bihar Elections Result: ముందంజలో ఎన్డీఏ.. పోస్టల్‌‌ కౌంటింగ్‌లో ఎవరికెన్ని వచ్చాయంటే..!

Nda

Nda

బీహార్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరిగింది. ఈ పోస్టల్ లెక్కింపులో ఎన్డీఏ కూటమి దూసుకుపోయింది. ప్రస్తుతం ఎన్డీఏ-71, ఇండియా కూటమి-44, జన్ సురాజ్ పార్టీ – 2 స్థానాల్లో దూసుకెళ్తున్నాయి.

మధ్యాహ్నం కల్లా బీహార్ ఫలితాలు రానున్నాయి. ఇక సర్వేలు చెప్పినట్లుగానే ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. దీంతో కార్యకర్తలు, నేతలు సంబరాలకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే స్వీట్లు, బాణాసంచాను ఎన్డీఏ కార్యకర్తలు సిద్ధం చేశారు.

రాఘోపూర్‌లో తేజస్వి యాదవ్ ముందంజ
ఇక లాలూ ప్రసాద్ యాదవ్‌ కుటుంబానికి కంచుకోట అయిన రాఘోపూర్‌లో తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. తేజస్వి యాదవ్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. రాఘోపూర్ ఆర్జేడీకి బలమైన స్థానం. గతంలో తేజస్వి యాదవ్ తండ్రి, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్, అతని తల్లి రబ్రీ దేవి ఇక్కడ నుంచే విజయం సాధించారు. ఇక తేజస్వి యాదవ్ 2015 నుంచి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2020 ఎన్నికల్లో 38,000 ఓట్ల తేడాతో తేజస్వి యాదవ్ గెలుపొందారు.

ఇక అలీపూర్‌లో మైథిలీ ఠాకూర్‌..  తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌదరి.. మహూవా నుంచి లాలూ పెద్ద కుమారుడు కుమారుడు తేజ్‌ప్రతాప్‌ యాదవ్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

Exit mobile version