Bihar Elections Live Updates: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసానుంది.. బీహార్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 243 కాగా.. ఈరోజు మలి విడతలో 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ నెల 6న తొలి విడతలో 18 జిల్లాల్లో మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగిన విషయం విదితమే.. మలి విడతలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 45,399గా ఉన్నాయి.. 3 కోట్ల 70 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.. 1,302 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు..
బీహార్‌లో రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. సరికొత్త రికార్డ్ దిశగా ఓటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 ఒంటి గంటకు 47.62 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. క్యూ లైన్లో ఉన్నవారికి రాత్రి వరకు అవకాశం ఉంటుంది.
47.62% approximate voter turnout recorded in the second and final phase of #BiharElection2025, till 1 pm. pic.twitter.com/Lb0D5ycvsk
— ANI (@ANI) November 11, 2025

బీహార్‌లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఇక ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ రోహ్తాస్ జిల్లా కార్గహర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు వేశారు. కోనార్ గ్రామంలోని ఒక పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.
బీహార్‌లో రెండో విడత పోలింగ్ చాలా జోరుగా సాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి ఓటు వేస్తున్నారు. పోలింగ్ బూత్‌లన్నీ కళకళలాడుతున్నాయి. ఉదయం 11 గంటలకు 31.38 శాతం పోలింగ్ నమోదైంది.
31.38% approximate voter turnout recorded in the second and final phase of #BiharElection2025, till 11 am. pic.twitter.com/bnN0UZmUeZ
— ANI (@ANI) November 11, 2025
బీహార్‌లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకే 14.55 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి దశ పోలింగ్ కంటే ఎక్కువగా నమోదవుతోంది. బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్.. కుటుంబ సభ్యులతో ఈ-రిక్షాలో పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటు వేశారు.
#WATCH | #BiharElection2025 | Bihar Congress president Rajesh Ram and candidate from Kutumba constituency, arrives at a polling booth in an e-rickshaw, to cast his vote. His family is also with him. pic.twitter.com/gznRtZvc5v
— ANI (@ANI) November 11, 2025
బీహార్‌లో ప్రస్తుతం రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. నవాడలోని వారిసాలిగంజ్ బూత్ దగ్గర స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. రాజకీయ పార్టీల మద్దతుదారులు ఘర్షణకు దిగడంతో పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితి పూర్తి అదుపులో ఉందని నవాడా పోలీసు సూపరింటెండెంట్ అభినవ్ ధీమాన్ తెలిపారు.
బీహార్‌లో రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. బీహార్‌కు ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం, సమానత్వంతో నిండిన ‘నమూనా’ అవసరం అని ఓటర్లకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు.

బీహార్‌లో రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. తొలి విడత పోలింగ్ కంటే వేగంగా సాగుతోంది. ఉదయం 9 గంటలకు 14.55 శాతం పోలింగ్ నమోదైంది.
14.55% approximate voter turnout recorded in the second and final phase of #BiharElection2025, till 9 am. pic.twitter.com/AVpqkM6GZk
— ANI (@ANI) November 11, 2025
బీహార్‌లో పోలింగ్ కొనసాగుతోంది. పశ్చిమ చంపారన్ జిల్లా నర్కటియాగంజ్లో కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతున్నారు. 100 శాతం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. పిల్లల భవిష్యత్ కోసం.. దేశ, రాష్ట్ర భవిష్యత్ కోసం ఓటు వేయాలని కోరారు.
#WATCH | Narkatiaganj, West Champaran: On voting in the second phase of #BiharElection2025, Union Minister Satish Chandra Dubey says, "...People are voting for the NDA alliance... 100% NDA and a double-engine government is going to be formed... We will urge all people to cast… https://t.co/6vSh45LxhT pic.twitter.com/p4aX5EzEpx
— ANI (@ANI) November 11, 2025
రెండో విడత పోలింగ్‌లో కూడా ఓటింగ్ ఎన్డీఏకు అనుకూలంగా ఉందని కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే బీహార్‌కు మేలు జరుగుతుంది. అన్ని రాష్ట్రాల కంటే బీహార్ కోసమే నాలుగు రెట్లు ఎక్కువగా ప్రధాని మోడీ మేలు చేస్తున్నారు.
బీహార్‌లో పోలింగ్ కొనసాగుతోంది. సీమాంచల్గా పేరుగాంచిన 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే పెద్ద ఎత్తున ఓటర్లు బూత్‌లకు తరలివచ్చారు. ప్రస్తుతం అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూ కట్టారు. ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా సాగుతోంది.

బీహార్‌లో రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. పూర్నియాలోని ఒక పోలింగ్ బూత్‌లో స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ ఓటు వేశారు.
#WATCH | Bihar: Independent MP from Purnea, Pappu Yadav, casts his vote at a polling booth in Purnea#BiharElection2025 pic.twitter.com/C8R03JCHe1
— ANI (@ANI) November 11, 2025
రెండు విడతలో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. అన్ని పనుల కంటే ఓటు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మీరు ఓటు వేయడమే కాకుండా.. ఇతరులను కూడా ఓటు వేసేలా ప్రేరేపించాలని విన్నవించారు.
लोकतंत्र में मतदान केवल हमारा अधिकार ही नहीं, दायित्व भी है।
आज बिहार विधानसभा चुनाव के दूसरे चरण का मतदान हो रहा है — सभी मतदाताओं से आग्रह है कि अपने मताधिकार का प्रयोग अवश्य करें।मतदान करें और दूसरों को भी प्रेरित करें।
पहले मतदान, फिर जलपान!— Nitish Kumar (@NitishKumar) November 11, 2025
చివరి విడతలో కూడా రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదు చేయాలని ఓటర్లకు జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి చేశారు. మార్పు కోసం ఓటింగ్ వేయాలని.. మార్పు జరిగితేనే పిల్లలకు విద్య, ఉపాధి దొరుకుతుంది. ఈరోజు తప్పు చేస్తే.. మరో ఐదేళ్లు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో బీహార్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటివి సర్వసాధారణమే. బీహారీయులు కలవరపడాల్సిన అవసరం లేదు.
#WATCH | Patna, Bihar: Jan Suraaj founder Prashant Kishor says, "I appeal to the people of Bihar to break the record turnout of the last phase today. Vote for change in Bihar. Vote for your children's education and employment. Vote in even greater numbers than you did in the… pic.twitter.com/uRO0dhBKm2
— ANI (@ANI) November 11, 2025
మలి విడత పోలింగ్ నేపథ్యంలో ప్రధాని మోడీ బీహార్ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. సరికొత్త రికార్డ్‌ను సృష్టించాలని విన్నవించారు. మొదటి సారి ఓటు వేస్తున్న యువత.. ఓటు వేసి ఇతరులను కూడా ఓటు వేసేలా ప్రేరేపించాలని మోడీ విజ్ఞప్తి చేశారు.
बिहार विधानसभा चुनावों में आज दूसरे और अंतिम चरण की वोटिंग है। सभी मतदाताओं से मेरा निवेदन है कि वे इसमें बढ़-चढ़कर भागीदार बनें और मतदान का नया रिकॉर्ड बनाएं। पहली बार वोट देने जा रहे राज्य के अपने नौजवान साथियों से मेरा विशेष आग्रह है कि वे खुद तो मतदान करें ही, दूसरों को भी…
— Narendra Modi (@narendramodi) November 11, 2025
పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రజలకు బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ విజ్ఙప్తి చేశారు. సెకండ్ విడతలో కూడా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 75 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు.
ఓటర్లకు భోజ్‌పురి గాయకుడు, నటుడు పవన్ సింగ్ భార్య జ్యోతి సింగ్ క్షమాపణ చెప్పింది. అన్ని ప్రాంతాలకు తిరిగి ఓటర్ల మద్దతు కోరడంలో విఫలమైనట్లు తెలిపింది. సేవ చేసే అవకాశం ఇవ్వాలని కరకట్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్యోతి సింగ్ విజ్ఞప్తి చేశారు.

బీహర్‌లో మలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌ల దగ్గర క్యూ కట్టారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొదటి విడతలో 121 స్థానాల్లో ఓటింగ్ జరగగా.. రెండో విడతలో 122 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.