Bihar Election Results: బీహార్ ఎన్నికల్లో బీజేపీ + జేడీయూల ఎన్డీయే కూటమి అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. మొత్తం 243 స్థానాలు ఉన్న బీహార్‌లో, ఇప్పటికే ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 190 స్థానాల మార్క్‌ని తాకిండి. ఆర్జేడీ + కాంగ్రెస్‌ల మహాఘట్బంధన్ కూటమి ఘోరంగా దెబ్బతింది. 2020 ఎన్నికల్లో 100కు పైగా సీట్లను కైవసం చేసుకున్న ఆర్జేడీ కూటమి ఈసారి కేవలం 50 స్థానాలలోపే పరిమితమైంది. ఎన్డీయేలో బీజేపీ, జేడీయూ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా గంట గంటకు ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయాయి.
Read Also: Maithili Thakur: విజయం దిశగా మైథిలి ఠాకూర్.. రాజకీయ కురువృద్ధుడ్ని వెనక్కినెట్టిన గాయని
ఇదిలా ఉంటే, బీహార్ ఓటింగ్‌కు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన జోస్యం నిజమవుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ షా బీహార్ లో గెలువబోయే స్థానాల గురించి అంచనా వేవారు. ఎన్డీయే 160కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని చెప్పారు. ఇప్పుడు ఆయన అంచనాలే నిజమవుతున్నాయి. నిజం చెప్పాలంటే అమిత్ షా అంచనాలను మించి ఎన్డీయే కూటమి ప్రదర్శన చేసింది. ఆ సమావేశంలో జేడీయూ, బీజేపీల మధ్య విభేదాలను కూడా ఆయన తోసిపుచ్చారు. ‘‘బీహార్ ప్రజలు ఎన్డీయే, బీజేపీతో ఉన్నారని నేను భావిస్తున్నాను. ఐదుగురు పాండవులు( బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం) ఎలాంటి వివాదాలు లేకుండా ఐక్యంగా ఉన్నాయి’’ అని అన్నారు.
