NTV Telugu Site icon

Bihar: సీఎం నితీష్ కుమారుడి పోస్టర్లు కలకలం.. పొలిటికల్ ఎంట్రీపై నిశాంత్ ఏమన్నారంటే..!

Bihar

Bihar

బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారాన్ని నిలుపుకునేందుకు జేడీయూ-బీజేపీ కూటమి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. ఈసారి ఎక్కువ సీట్లు సాధించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.

ఇది కూడా చదవండి: AJTIH : అజిత్ కుమార్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్ డేట్ ఫిక్స్

ఇదిలా ఉంటే బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ రాజకీయ ప్రవేశంపై పోస్టర్లు వెలిశాయి. నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. ‘‘బీహార్ కరే పుకార్, ఆయే నిశాంత్ కుమార్’’ అనే నినాదంతో పాటు ఆయన చిత్రంతో కూడిన జేడీ(యూ) పోస్టర్లు రాష్ట్రంలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో నిశాంత్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి.

47 ఏళ్ల నిశాంత్ .. జేడీయూలో ఇప్పటి వరకు ఎలాంటి పదవులు అనుభవించలేదు. ఎలాంటి హడావుడి రాజకీయాలు చేయలేదు. ఒంటరి జీవితాన్నే కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా తక్కువ స్థాయి ప్రొఫైల్‌ను కొనసాగించారు. అయితే తల్లి మంజు సిన్హా జయంతి సందర్భంగా నిశాంత్ నివాళులు అర్పించడానికి తన తండ్రితో కలిసి స్మారక చిహ్నం దగ్గరకు వచ్చారు. ఈ సందర్భంగా నిశాంత్‌ను మీడియా ప్రతినిధులు.. పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించారు. దీనికి బదులు ఇస్తూ.. ‘‘ఇక వదిలేయండి ( అరేయ్ చోడియే )’’ అని నిశాంత్ ఘాటుగా స్పందించారు. తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: నేటితో ముగుస్తున్న కుంభమేళా.. పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు

బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. నిశాంత్ రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది ఆయన తండ్రి నితీష్‌పైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. ‘‘నిశాంత్ జీ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది నితీష్ కుమార్‌పై ఆధారపడి ఉంటుంది. ఆయన ఆమోదం లేకుండా పొలిటికల్ నిర్ణయం సాధ్యం కాదు. అయితే నిశాంత్‌కు బీహార్ రాజకీయాలపై జ్ఞానం మరియు పట్టు ఉందనడంలో సందేహం లేదు” అని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: Maha Shivaratri 2025: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు.. శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు!