Site icon NTV Telugu

CM Nitish Kumar: ప్రధాని మోడీని కలిసిన సీఎం నితీష్ కుమార్.. ఎన్డీయేలో చేరిక తర్వాత తొలి భేటీ..

Pm Modi, Cm Nitish Kumar

Pm Modi, Cm Nitish Kumar

CM Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఇండియా కూటమి, ఆర్జేడీతో పొత్తుని తెంచుకుని ఇటీవల ఆయన మళ్లీ బీజేపీతో జతకట్టి ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. 9వ సారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. మళ్లీ బీజేపీ-జేడీయూ ప్రభుత్వాన్ని బీహార్‌లో ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, ఎన్డీయేలోకి తిరిగి చేరిన తర్వాత తొలిసారిగా ఆయన ఢిల్లీకి వచ్చారు. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.

Read Also: Indian Student: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. ఈ ఏడాది 5వ ఘటన..

లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి రూపశిల్పుల్లో ఒకరిగా ఉన్న జేడీయూ చీఫ్, సీఎం నితీష్ కుమార్ కూటమికి గుడ్ బై చెప్పడంతో ఒక్కసారిగా అందర్ని ఆశ్చర్యపరిచింది. సీఎం నితీష్ కుమార్‌కి వ్యతిరేకంగా ఆర్జేడీ, కాంగ్రెస్ కుట్ర పన్నినందుకు తాము ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినట్లు జేడీయూ నేతలు ఆరోపిస్తున్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ఇరు నేతలు తాజా భేటీలో చర్చించే అవకాశం ఉంది. 2019 పొత్తులో బీహార్ ఎంపీ స్థానాల్లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఈ ఎన్నికల్లో 40 సీట్లకు గానూ 39 స్థానాల్ని కైవసం చేసుకుంది. అయితే, ఈ సారి కూడా పొత్తు గురించి ప్రధానితో సీఎం నితీష్ కుమార్ చర్చించే అవకాశం ఉంది.

Exit mobile version