Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. నాలుగు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లిన నితీష్ కుమార్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు కోసం ప్రతిపక్ష నేతల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో సమావేశమయ్యారు. వామపక్ష నేతలైన సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. శరద్ పవార్‌తో సమావేశం అనంతరం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. “చాలా మంచి సంభాషణ జరిగింది. ఈ (బీజేపీ) నేతలు ఏ పనీ చేయడం లేదు. ఐక్యంగా ఉండటమే ముఖ్యం. ప్రతిపక్షాలన్ని ఏకం చేయాలని కోరుకుంటున్నారు. ఒకవేళ ప్రతిపక్షాలన్ని ఏకమైతే అది దేశ ప్రయోజనాలకు మేలు చేస్తుంది.”
Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. పీఎం శ్రీ పేరుతో దేశవ్యాప్తంగా మోడల్ స్కూళ్లు
బీజేపీతో తెగతెంపులు చేసుకున్న జేడీయూ నేత ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఉదయం సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్యను కలిశారు. నితీశ్ కుమార్ మంగళవారం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. బీహార్ అసెంబ్లీలో 16 మంది లెఫ్ట్ పార్టీల ఎమ్మెల్యేలు నితీష్ ప్రభుత్వానికి బయట నుండి మద్దతు ఇస్తున్నారు. వీరిలో 12 మంది సిపిఐ-ఎంఎల్ (ఎల్), సీపీఐ, సీపీఎంలకు చెందిన ఎమ్మెల్యేలు ఇద్దరు చొప్పున ఉన్నారు.
Bihar CM Nitish Kumar meets NCP chief Sharad Pawar, in Delhi pic.twitter.com/OvT3MS8Cga
— ANI (@ANI) September 7, 2022