NTV Telugu Site icon

Names to Tiger Cubs: నాలుగు నవజాత పులి పిల్లలకు పేర్లు పెట్టిన బిహార్ సీఎం.. పేర్లేమిటో తెలుసా?

Names To Tiger Cubs

Names To Tiger Cubs

Names to Tiger Cubs: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి నీరజ్ కుమార్ బబ్లూ శుక్రవారం నాలుగు నవజాత పులి పిల్లలకు పేర్లు పెట్టారు. పులుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఆయన నాలుగు పులి పిల్లలకు పేర్లు పెట్టారు. మూడు మగ పిల్లలు, ఒక ఆడ పిల్లకు కుమార్ కేశరి, విక్రమ్, మగద్, రాణి పేర్లను పెట్టినట్లు వెల్లడించారు. “ఈ నాలుగు పిల్లలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు పెట్టారు. కేశరి, విక్రమ్, మగధ, రాణి ఈ నాలుగు పేర్లు పెట్టారు” అని అటవీ, పర్యావరణ మంత్రి నీరజ్ కుమార్ బబ్లూ చెప్పారు. పులుల సంఖ్య పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని కుమార్ తెలిపారు. “2018 లెక్కల ప్రకారం, పులుల సంఖ్య 31 కాగా.. 2022 నివేదిక ఇంకా రావాల్సి ఉంది. పులుల సంఖ్య ప్రస్తుతం 45 అని తాను భావిస్తున్నా. ఒక పులి నాలుగు పిల్లలకు జన్మనివ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. పుట్టిన నాలుగు పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. చాలా సందర్భాలలో నాలుగు నవజాత పిల్లలలో రెండు చనిపోయాయి. ఈ సారి నాలుగు ప్రాణాలతో బయటపడ్డాయి. ఆ కోణంల చాలా అదృష్టవంతులం” అని అన్నారాయన.

ప్రత్యేక వైద్యుల బృందం వన్యప్రాణులను నిరంతరం పర్యవేక్షిస్తూ, జూ అధికారులు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భారతదేశంలో ప్రస్తుతం 52 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయని, పులుల సంరక్షణలో స్థానిక సంఘాలను భాగస్వామ్యం చేసేందుకు వినూత్న చర్యలు చేపడుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అంతకుముందు శుక్రవారం తెలియజేశారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా, పులిని రక్షించడానికి చురుకుగా పనిచేస్తున్న వారందరినీ నేను అభినందిస్తున్నాను. భారతదేశం 75,000 చ.కి.మీ కంటే ఎక్కువ భూభాగంలో 52 టైగర్ రిజర్వ్‌లను కలిగి ఉండటం గర్వకారణం. పులుల రక్షణలో స్థానిక సంఘాలను భాగస్వామ్యం చేసేందుకు వినూత్న చర్యలు చేపట్టడం జరిగింది.” అని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Vizag Zoo Park: బరితెగించిన యువకులు.. పందుల ఎన్‌క్లోజర్‌లోకి దూకి..

2020లో విడుదలైన భారత పులుల గణన నివేదిక ప్రకారం, ప్రపంచంలోని పులుల సంఖ్యలో భారత్‌లో దాదాపు 70 శాతం ఉంది. ప్రపంచంలోని జీవవైవిధ్యంలో భారత్‌లో 8 శాతం ఉందని నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ పులుల దినోత్సవం అనేది పులుల సంరక్షణ కోసం అవగాహన పెంచడానికి వార్షిక వేడుక. ఇది ఏటా జూలై 29న నిర్వహించబడుతుంది. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ టైగర్ సమ్మిట్‌లో 2010లో ఈ రోజును నిర్ణయించారు. ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం పులుల సంరక్షణ కోసం ప్రజల అవగాహన, మద్దతును పెంచడం, అలాగే పులుల సహజ ఆవాసాలను రక్షించడానికి ప్రపంచ వ్యవస్థను సమర్ధించడం.

Show comments