Site icon NTV Telugu

BIhar: సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి.. 13 మంది అరెస్ట్

Bihar Cm Convoy Attacked

Bihar Cm Convoy Attacked

Bihar CM convoy attacked, 13 people arrested: బీజేపీతో పొత్తు తెంచుకుని ఆర్జేడీ పొత్తుతో మళ్లీ నితీష్ కుమార్ ఎనిమిదో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, ఇతర కార్యక్రమాలపై పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు నితీష్ కుమార్. ఇదిలా ఉండగా.. ఆదివారం నితీష్ కుమార్ కాన్వాయ్ పై రాళ్లదాడి జరిగింది. ఈ దాడిలో నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. అయితే కాన్వాయ్ లో ఆ సమయంలో నితీష్ కుమార్ లేరు.

పాట్నా-గయ మార్గంలో గౌరీచ్ లోని సోహ్గి గ్రామం వద్ద మూకుమ్మడి పలువురు కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం గయలో నితీష్ కుమార్ పర్యటన ఉంది. గయలో నిర్మిస్తున్న రబ్బర్ డ్యామ్ పరిశీలించేందుకు వెళ్లనున్నారు. అయితే దీని కోసం కాన్వాయ్ గయకు వెళ్తున్న సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రెండు మూడు రోజులుగా తప్పిపోయిన యువకుడు శవమై కనిపించడంతో ఆగ్రహంతో ఉన్న గుంపు పాట్నా-గయా రోడ్డును అడ్డుకుందని.. ఈ సమయంలోనే కాన్వాయ్ పై దాడి జరిగినట్లు పాట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ వెల్లడించారు.

Read Also: Mobile Usage: ఇండియాలో సగటున పెరిగిన మొబైల్ వినియోగం.. ఎక్కువమంది చూసేవి ఏంటంటే?

అయితే ఈ ఘటనపై జేడీయూ-ఆర్జేడీ మహాగటబంధన్ కూటమిపై విమర్శలు గుప్పిస్తోంది బీజేపీ. బీహార్ లో మళ్లీ అక్రమార్కుల రోజుల వచ్చాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అని విమర్శించింది. మరికొంత మంది ఈ దాడిని బీజేపీ కుట్రగా అభివర్ణించారు. ఇటీవల ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ, కాంగ్రెస్ సహకారంతో మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా.. మొత్తం 31 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ బీహార్ లో జంగిల్ రాజ్ పాలన వచ్చిందని.. బీజేపీ విమర్శిస్తోంది.

Exit mobile version