బీహార్‌లో తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు.
ఇది కూడా చదవండి: Pak-Afghan: ఈరోజు మరోసారి చర్చలు.. విఫలమైతే యుద్ధమేనన్న పాక్ రక్షణమంత్రి ఖవాజా
ఇక తొలి విడతలో భాగంగా పలువురు ప్రముఖులు ఓట్లు వేశారు. కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, రాజీవ్ రంజన్ (లాలన్) సింగ్ ఓటు వేయగా.. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ తన భార్యతో కలిసి హాజీపూర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఇక ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ తన కుటుంబంతో కలిసి పాట్నాలో ఓటు వేశారు. అలాగే డిప్యూటీ సీఎం అభ్యర్థి ముఖేష్ సహానీ కూడా తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ 14న కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధి, విద్య, మంచి ఆరోగ్య సంరక్షణ కోసం ఓటు వేయాలని కోరారు. బీహార్ ప్రజలు వర్తమానం, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.
తొలి దశలో పోటీ చేస్తున్న వారిలో మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, బీజేపీ ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా వంటి అగ్ర నాయకులు ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి దశలో 121 స్థానాలకు.. రెండో దశలో 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 11న రెండు విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.
#WATCH | Union Minister Rajiv Ranjan (Lalan) Singh casts his vote in #BiharElection2025, at a polling booth in Patna
He says, "This is a festival of democracy. We must follow 'Pehle matdaan, phir jal-paan'…NDA government in the leadership of Nitish Kumar will be formed in… pic.twitter.com/uYSfZuwl88
— ANI (@ANI) November 6, 2025
#WATCH | Darbhanga: VIP chief and Mahagathbandhan's Deputy CM face Mukesh Sahani, along with his family, cast his vote in the first phase of #BiharElection2025 pic.twitter.com/4ws5GLXAlz
— ANI (@ANI) November 6, 2025
13.13% approximate voter turnout recorded in the first phase of #BiharElection2025, till 9 am. pic.twitter.com/cMkp5z2xi5
— ANI (@ANI) November 6, 2025
