NTV Telugu Site icon

Jammu Kashmir: పాకిస్తాన్ ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా ఆయుధాలు స్వాధీనం..

Jammu Kashmir

Jammu Kashmir

Biggest Arms Recovery, Forces Stop Major Pak Attempt In Kashmir: దాయాది దేశం పాకిస్తాన్ ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో అలజడులు రేపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులను వెంటాడి వేటాడి మట్టుబెడుతున్నాయి. దీంతో కొత్తగా హైబ్రీడ్ టెర్రిరిజాన్ని కూడా ప్రారంభించాయి ఉగ్రవాద సంస్థలు. అమాయకులైన పౌరులను కాల్చి చంపేస్తున్నాయి. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని కూడా భద్రతా బలగాలు చంపేస్తున్నాయి. దీంతో కాశ్మీర్లో మళ్లీ ఉగ్రవాద చర్యలను పెంచేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.

Read Also: Viral Video: పెళ్లి చేసుకోమని అడిగిన యువతి.. పిచ్చకొట్టుడు కొట్టిన యువకుడు

ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసింది ఊరీ సెక్టార్ లో పాక్-ఇండియా సరిహద్దుల్లో ఓ గుహలో దాచిపెట్టిన ఆయుధాలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ స్వాధీనం చేసుకున్నాయి. 8 ఏకే రైఫిళ్లు, 12 పిస్టల్స్‌తో పాటు ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాల ఆయుధాల రికవరీలో ఇదే పెద్ద ఘటన. వీటిలో పాకిస్తాన్ చిహ్నాలతో ఉన్న బెలూన్లను కూడా భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

శనివారం ఉదయం బారాముల్లా జిల్లా హత్లంగా గ్రామంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఆయుధ సరఫరా గురించి అధికారులుకు నిర్దిష్ట సమాచారం ఉందని అధికారులు వెల్లడించారు. పీఓకేలో ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ల నుంచి భారత్ లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ఎదురుచూస్తున్నారు. వీరి కోసమే ఉగ్రవాదులు ముందస్తుగా ఆయుధాలు సరఫరా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Show comments