Pune: పూణె అత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. యువతికి అది ఇష్టం లేకనే..!
- పూణె అత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్
- ఖంగుతిన్న పూణె పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణె అత్యాచార ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు చెప్పిన మాటలకు ఖాకీలే షాక్ గురయ్యారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులకు.. విషయం తెలిసి మైండ్ బ్లాక్ అయింది.
ఇది కూడా చదవండి: KCR: నిలకడగా కేసీఆర్ ఆరోగ్యం..
Also Read
- Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర ఎక్స్‌ఫర్ట్’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
- Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్‌కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
- India On PoK: పీఓకే ఎన్నికలు కేవలం నాటకం.. పాకిస్తాన్‌పై భారత్ ఫైర్..
పూణెలో అది బహుళ అంతస్థు బిల్డింగ్. బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో కొరియర్ బాయ్ పార్శిల్ తీసుకొచ్చి.. తనపై అత్యాచారం చేశాడంటూ ఐటీ ప్రొఫెషనల్ అయిన మహిళ (22) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం చెప్పడంతో ఖంగుతిన్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: బంగారం ధరల్లో స్వల్ప మార్పులు.. నేడు తులం ఎంతంటే?
అత్యాచారం చేసింది యువతి బాయ్ఫ్రెండేనని పోలీసులు తేల్చారు. ఇద్దరు మొబైల్స్‌ను పరిశీలించగా ఆధారాలు లభించాయి. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో యువతి.. స్నేహితుడిని ఇంటికి పిలుస్తూ ఉంటుంది. అదే మాదిరిగా బుధవారం రాత్రి కూడా అలానే పిలిచింది. స్నేహితుడు ఎప్పుడు ఇంటికి వచ్చినా కొరియర్ బాయ్ రూపంలోనే దర్శనమిచ్చేవాడు. బుధవారం రాత్రి కూడా పార్శిల్ తెచ్చినట్లుగా ఇంటికి వచ్చాడు. అనంతరం ఇద్దరూ గదిలోకి వెళ్లాక.. లైంగిక దాడి చేసేందుకు స్నేహితుడు బలవంతం చేశాడు. కానీ ఆ సమయంలో ఆమెకు ఇష్టం లేదు. అయినా కూడా బాయ్ ఫ్రెండ్ బలవంతంగానే లైంగిక దాడి చేశాడు.
ఇదే ఆమెకు కోపం తెప్పించింది. బలవంతంగా చేశాడని వెంటనే పోలీసులకు ఫోన్ చేసి కొరియర్ బాయ్ అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. పెప్పర్ స్ప్రే చల్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదు చేసింది. తన మొబైల్లో నిందితుడు సెల్ఫీ కూడా తీసుకున్నాడని.. మళ్లీ వస్తానంటూ రాసిపెట్టాడని నాటకాలు ఆడింది. తీరా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా బాగోతం అంతా బయటపడింది. బాధిరాలు కూడా అసలు నిజాన్ని ఒప్పుకుంది. బలవంతంగా లైంగిక దాడి చేశాడనే కోపంతో కంప్లైంట్ చేసినట్లు నేరాన్ని ఒప్పుకుంది. ఇంకో విషయమేంటంటే సెల్ఫీ కూడా ఆమెనే తీసింది. మార్ఫింగ్ చేసి బెదిరించినట్లుగా మార్చింది. ఇక ఇరు కుటుంబాలు కూడా ఒకరికొకరు తెలిసిన కుటుంబాలు కావడం విశేషం. కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆమె పోలీసుల ఎదుట అంగీకరించింది.
ఇదిలా ఉంటే ఈ అపార్ట్‌మెంట్‌కు స్నేహితుడు అనేక మార్లు వచ్చాడు. అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నట్లుగా స్థానికులు చెప్పారు. తెలిసిన వ్యక్తే అని ఎవరూ పట్టించుకోలేదు. తప్పుడు సమాచారం ఇచ్చి ఇప్పుడు ఆమె బద్నాం అయింది.
తాజావార్తలు
-
Andhra Pradesh : మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
-
OTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..? కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశామా అంటున్నారా..?
-
Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర ఎక్స్‌ఫర్ట్’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
-
Tilak Varma: తిలక్ వర్మకు షాక్ తప్పదా..? రిప్లేస్ చేసేందుకు రెడీగా రజత్ పాటిదార్..
-
Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!