Site icon NTV Telugu

Ahmedabad Plane Crash: భారీగా దెబ్బతిన్న బ్లాక్ బాక్స్! డేటా సేకరించడం కష్టమే! జాతీయ మీడియా కథనాలు

Ahmedabadplanecrashblockbox

Ahmedabadplanecrashblockbox

జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి గల కారణాలను రెండు దర్యాప్తు సంస్థలు అన్వేషిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 279 మంది చనిపోయారు. ఇక ప్రమాదం జరిగిన 28 గంటల తర్వాత ప్రమాద స్థలి నుంచి బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బ్లాక్ బాక్స్ భారీగా ధ్వంసం అయినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. డేటా సేకరణ కోసం వాషింగ్టన్ డీసీకి పంపించాలని భావించారు. కానీ బ్లాక్ బాక్స్ భారీగా ధ్వంసం కావడంతో డేటా సేకరించడం కష్టమేనని దర్యా్ప్తు సంస్థలు భావిస్తున్నట్లు వర్గాల సమాచారం.

ఇది కూడా చదవండి: Tollywood : జులై 11న పెద్ద సినిమాకు పోటీగా చిన్న సినిమా

ఇక బ్లాక్‌బాక్స్‌ను డీకోడ్‌ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు వస్తున్న వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. టెక్నికల్‌, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్‌బాక్స్‌ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. బ్లాక్ బాక్స్‌ను ఎక్కడి పంపించాలన్న నిర్ణయాన్ని దర్యాప్తు సంస్థలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఇది కూడా చదవండి: Yogandhra 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. మరో గిన్నిస్ రికార్డు కోసం అధికారుల కసరత్తు!

ఇదిలా ఉంటే ఎయిరిండియా విమాన ప్రమాదానికి విద్యుత్ వైఫల్యమే కారణంగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. విద్యుత్ అంతరాయం వల్లే విమానం కూలిపోయినట్లుగా భావిస్తున్నారు. ఇక ప్రత్యక్ష సాక్షులు కూడా ఇవే విషయాన్ని వెల్లడించారు. విమానం కూలిపోతున్నప్పుడు లైట్లు రెపరెపలాడుతున్నాయని… అసాధారణ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. దీంతో విద్యుత్ సమస్య తలెత్తి కూలిపోయి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి.

విమానంలోని ప్రధాన విద్యుత్ వ్యవస్థలో లోపం తలెత్తి ఉంటుందని.. అందుకే విమానం కూలిపోయేటప్పుడు పెద్ద శబ్దం వచ్చినట్లుగా భావిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, ఏటీసీ ప్రకటనలు, శిథిలాలను పరిశీలించిన తర్వాత ప్రాథమిక పరీక్షల ద్వారా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. విమానంలో విద్యుత్ లోపం ఉన్నట్లు సంకేతాలు కనిపించాయని.. ఏటీసీతో వెంటనే కమ్యూనికేషన్ తెలిపోయినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా శిథిలాల దగ్గర కూడా విద్యుత్ వ్యవస్థ దగ్గర సమస్యలు ఉన్నట్లుగా గుర్తించినట్లుగా వర్గాలు తెలిపాయి. విమానం ఒక్కసారి ఎత్తు కోల్పోతున్న సమయంలో సమీపంలో ఉన్న ప్రజలు.. లైట్లు మిణుకుమిణుకుమంటు కనిపించాయని.. అసాధారణ శబ్దాలు వినిపించాయని చెప్పారు.

ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు నిర్వహిస్తోంది. మరోవైపు హోం కార్యదర్శి అధ్యక్షతన ఒక ప్యానెల్ సమాంతర దర్యాప్తు నిర్వహిస్తోంది. ఇలా రెండు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ మేడే కాల్ ఇచ్చాడు. కానీ అప్పటికే ఏటీసీతో విమానం సంబంధం కోల్పోయింది. దీనికంతటికి కారణం విద్యుత్ సమస్యనే కారణంగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు బ్లాక్ బాక్స్ బాగా దెబ్బతిన్నట్లుగా గుర్తించారు. దీన్ని ఓపెన్ చేసేందుకు అమెరికాకు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం కేంద్రం నుంచి అనుమతులు రావల్సి ఉంటుంది.

జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం బయల్దేరింది. కొన్ని సెకన్లలోనే హాస్టల్‌పై కూలిపోయింది. విమానంలో ఒక్కరు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇక హాస్టల్‌లో ఉన్న 34 మంది మెడికోలు చనిపోయారు. ఇక విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా చనిపోయారు. కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Exit mobile version