NTV Telugu Site icon

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 40 మంది మావోయిస్టుల హతం..

Fdsafdsf

Fdsafdsf

Big Breaking: ఛత్తీస్‌గఢ్ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్రంలోని నారాయణపూర్-దంతెవాడ సరిహద్దుల్లోని మాడ్ ఏరియాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపుగా 40 మంది మావోయిస్టులు హతమయ్యారు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆటోమేటిక్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు భద్రతా బలగాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. అయితే, ఎన్ కౌంటర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేస్తూ.. ఇప్పటి వరకు 40 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు వెల్లడించారు..

Read Also: Nirmala Sitharaman: రానున్న ఐదేళ్లలో సామాన్యుల జీవితాల్లో మార్పులు తీసుకొస్తాం

ఇటీవల కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించిన దాఖలాలు లేవు. జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) నిన్న మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఇప్పటికీ కాల్పులు జరుగుతూనే ఉన్నట్లు సమచారం. ఏక్-47 రైఫిళ్లతో సహా అటాల్ట్ రైఫిళ్లు, ఇతర ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఓర్చా, బర్సూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని గోవెల్, నెందుర్, తుల్తుడి గ్రామాల్లో జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. అటవీ ప్రాంతంలోకి పారిపోయిన మావోల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మావోయిస్టులకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద విజయాల్లో ఇది ఒకటని అక్కడి అధికారులు అభివర్ణిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఇద్దరు యువ ఐపీఎస్ అధికారులు ప్రభాత్ కుమార్, గౌరవ్ రాయ్ నాయకత్వంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలను సీఎం విష్ణుదేవ్ అభినందించార. సైనికుల ధైర్యాన్ని కొనియాడారు. ఈ ఏడాది కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోయిస్టులు మరణించారు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్ దాని కన్నా పెద్దది. 2024లో ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్రల్లో కలిపి 200 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. ప్రతీ ఎన్‌కౌంటర్‌లో ఆరు నుంచి 10 మంది మావోలు హతమవుతున్నారు.

Show comments