NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: పొత్తులపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. కేసీఆర్ కాంగ్రెస్ తో కలవాల్సిందే..!

Kcr, Komati Reddy Venkat Reddy

Kcr, Komati Reddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: పొత్తులపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ తో కలవాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి 2023లో జరిగే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ వస్తుందని చెప్పారు. ఇవాళ కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోమటిరెడ్డి న్యూఢిల్లీలో కలిసిన ఆయన జాతీయ రహదారులతో పాటు రీజినల్ రింగ్ రోడ్లకు సంబంధించిన అంశంపై కేంద్ర మంత్రికి ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈనేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాగా.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్వంతంగా 60 సీట్లు దక్కవన్నారు. తనకున్న రాజకీయ అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్ననని.. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Haath se haath Jodo: రేవంత్‌ తో వీహెచ్‌ పాదయాత్ర.. సాయంత్రం భట్టితో..

అంతేకాకుండా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు సెక్యులర్ పార్టీలని, అందుకే ఈ రెండు పార్టీలు కలుస్తాయని ఆయన జోస్యం చెప్పారని అన్నారు. ఇక ఎన్నికలకు ఎంతో సమయం లేదని, ఎన్నికలకు కనీసం ఏడాది ముందే కనీసం 60 అభ్యర్ధులను ప్రకటించాలని తాము రాహుల్ గాంధీని కోరిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. అయితే.. కొత్త- పాత అనే తేడాలేకుండా గెలిచే అభ్యర్ధులకే టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. దీంతో..ఎన్నికల తర్వాత పొత్తులుంటాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. అయితే.. ఈ ఏడాది మార్చి 1 నుండి పాదయాత్ర.. బైక్ యాత్ర చేస్తానని వెంకట్ రెడ్డి చెప్పారు. ఇక.. అసెంబ్లీ ఎన్నికలకు కనీసం ఏడాది ముందుగానే అభ్యర్ధులను ప్రకటించాలని రాహుల్ గాంధీని కోరినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అయితే.. గతంలో వరంగల్ పర్యటనకు రాహుల్ గాంధీ వచ్చిన సమయంలో ఈ విషయమై ఆయనతో చర్చించినట్టుగా తెలిపారు.

Read also: Bajrang Dal: ప్రేమికుల రోజు రచ్చ షురూ.. ఎల్బీనగర్ లో భజరంగ్ దళ్ హల్‌ చల్‌

ఈనేపథ్యంలో తమ పార్టీ నేతలంతా కష్టపడి పనిచేస్తే 40 సీట్లు వస్తాయని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ఒక్కరే పార్టీని గెలిపిస్తా అంటే అది జరిగే పని కాదని చెప్పిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేపు మాణిక్ రావు ఠాక్రేను కలిసి అన్ని విషయాలను చర్చించనున్నట్టుగా చెప్పారు. ఇక.. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ పొగడాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేసీఆర్ ఎందుకు తమ పార్టీలో చేర్చుకున్నారని? ప్రశ్నించారు. ఇక.. రాజకీయ వ్యూహంలో భాగంగానే కేసీఆర్ కాంగ్రెస్ ను పొగిడారన్నారు. ఇకఅసెంబ్లీలో ఈటల రాజేందర్ ను గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడారు? వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ఈటలపై ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Love or Attraction: మీ ప్రేమ ఎలా మొదలైంది.. అది ఆకర్షణా లేక..?