Bhutan Lake Burst: భూటాన్‌లో భారీ గ్లేసియర్ సరస్సు బద్దలు.. అసోం, ఉత్తర బెంగాల్‌కు వరద ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhutan Lake Burst: భూటాన్‌లోని ఎత్తైన పర్వత ప్రాంతంలో భారీ హిమానీనద సరస్సు (Glacial Lake) బద్దలవడంతో అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వరద ముప్పు పొంచి ఉంది. భూటాన్‌లోని సింటాఫు (Sintaphu) సరస్సు గురువారం రాత్రి బద్దలైనట్లు సమాచారం. దీంతో ఉత్తర బెంగాల్‌లోని లోతట్టు ప్రాంతాలు, అసోంలోని పలు జిల్లాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. సంకోష్ నది, దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేశారు. వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.
భూటాన్‌లో సరస్సు బద్దలవడంతో భారీగా విడుదలైన నీరు మరో 5 నుంచి 6 గంటల్లో మైదాన ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ మంత్రి నిసిత్ ప్రమాణిక్ వెల్లడించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. జాతీయ విపత్తు స్పందన దళం (NDRF)కు కూడా సమాచారం అందించారు. విపత్తు నిర్వహణ వాలంటీర్లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
Also Read
- SIR New Schedule: తెలంగాణ, ఏపీ సహా 6 రాష్ట్రాల్లో SIR గడువు పొడిగింపు.. కొత్త షెడ్యూల్ ఇదే!
- Virat Kohli: ఢిల్లీ కాలుష్యంపై అవగాహనకు విరాట్ కోహ్లీ సాయం తీసుకోండి.. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన
- UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
- Neha Bora: నాలుగోసారి కూడా.. శాంతి ఒప్పందంపై సంతకానికి నేహా బోరా నిరాకరణ
వరద ముప్పు నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దువార్ జిల్లాలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని అలీపుర్దువార్ ఎస్పీ అమిత్ కుమార్ షా సూచించారు. భూటాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. పోలీసు శాఖ, జిల్లా కలెక్టర్ కార్యాలయం, బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు, ఇతర సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు.
రాష్ట్ర విపత్తు స్పందన దళం (SDRF) ఇప్పటికే రంగంలోకి దిగిందని, ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా అక్కడికి చేరుకుంటోందని తెలిపారు. సివిల్ డిఫెన్స్ బృందాలను సైతం సహాయక చర్యల్లో భాగస్వామ్యం చేసినట్లు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తగా సుమారు 4 వేల నుంచి 5 వేల మందిని పాఠశాల భవనాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. మరో ప్రకటనలో ప్రస్తుత నీటి ప్రవాహ పరిస్థితులను బట్టి 6 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.
తాజా సమాచారం ప్రకారం నీటి ప్రవాహ తీవ్రత కొంత తగ్గినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలు, తాగునీరు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అలాగే మరుగుదొడ్లు సహా ఇతర కనీస సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. రాబోయే గంటల్లో నీటి ప్రవాహంలో వచ్చే మార్పులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. సంకోష్ నదీ వ్యవస్థకు ప్రస్తుతం రెడ్ అలర్ట్ అమల్లో ఉందని ఎస్పీ వెల్లడించారు.
ఈ జిల్లాలకు వరద ముప్పు.. హై అలర్ట్ జారీ
భూటాన్‌లోని హిమనద సరస్సు బద్దలైన ప్రభావంతో అసోం, ఉత్తర బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో నీటిమట్టం అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.
ముఖ్యంగా ఈ ప్రాంతాలను అప్రమత్తం చేశారు:
అలీపుర్దువార్: పశ్చిమ బెంగాల్లో వరద ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి.
జల్పాయిగురి: లోతట్టు ప్రాంతాల్లో నీటిమట్టం పెరిగే అవకాశం.
డార్జిలింగ్ కొండ ప్రాంతాలు: వరద ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని సూచన.
ధుబ్రి: అసోంలోని ఈ జిల్లాలో సంకోష్ నదీ పరివాహక ప్రాంతాలకు హెచ్చరికలు జారీ.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
సంకోష్ నది, దాని ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు నది సమీపానికి వెళ్లవద్దని, నీటి మట్టం పెరిగే సూచనలు కనిపిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. భూటాన్‌లో చోటుచేసుకున్న హిమానీనద సరస్సు విస్ఫోటనం (GLOF) కారణంగా తలెత్తిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు అసోం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. సహాయక బృందాలు రంగంలోకి దిగడంతో పాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి.
#WATCH | BJP MP Raju Bista tweets, "A glacial lake outburst flood (GLOF) has been reported at Lemthang in Bhutan. The overflowing water from the lake is flowing downwards through the Mofu River towards the Sunkosh River. Therefore, everyone living in the catchment areas of the Sunkosh River and all its connected tributaries have been informed to move to a safe distance immediately to protect their lives. Everyone in our Darjeeling hills, Terai and Dooars region are requested to stay alert."
(Video source: Raju Bista/X)
— ANI (@ANI) October 29, 2026
తాజావార్తలు
-
Bhutan Lake Burst: భూటాన్‌లో భారీ గ్లేసియర్ సరస్సు బద్దలు.. అసోం, ఉత్తర బెంగాల్‌కు వరద ముప్పు
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
AP News: నేడు రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు.. ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ!
-
India vs New Zealand: ఈడెన్ పార్క్‌లో టీమిండియా అజేయ రికార్డు.. 100% విజయాలతో భారత్ హవా!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..