NTV Telugu Site icon

Bhole Baba Missing: పరారీలో భోలే బాబా.. హత్రాస్లో 121కి చేరిన మృతుల సంఖ్య..

Bole Baba

Bole Baba

Bhole Baba Missing: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని హత్రాస్ లోని ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరుకుంది. కాగా.. సత్సంగ్ నిర్వహించిన తర్వాత జరిగిన ఘటనతో ‘భోలే బాబా’ పరార్ అయ్యాడు.. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మెయిన్‌పురి జిల్లాలోని రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్ట్‌లో అధికారులు ఇప్పటికే సోదాలు నిర్వహించారు. బాబా కనిపించలేదని డీఎస్పీ సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 23 మంది డెడ్ బాడీలను అలీగఢ్ కు తరలించినట్లు పోలీసులు తెలపగా.. అందులో 19 మందిని గుర్తించామన్నారు.

Read Also: AP Crime: భార్య చేతిలో భర్త హతం.. స్క్రూడ్రైవర్‌తో పొడిచి..!

కాగా, భోలే బాబాగా ప్రసిద్ధి చెందిన నారాయణ్ సాకార్‌ హరి సత్సంగంలో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, అసలు భోలే బాబా ఎవరు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఆయన పటియాలి తహసీల్‌లోని బహదూర్ గ్రామానికి చెందిన వ్యక్తి కాగా.. గతంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పని చేసినట్లుగా చెప్పుకొచ్చాడని పేర్కొన్నారు. 17 ఏళ్ల పాటు ఇందులో పని చేసి.. 26 ఏళ్ల క్రితం ఉద్యోగాన్ని వదిలి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినట్లు ప్రచారం అవుతుంది. తనకు గురువు కూడా ఎవరూ లేరని చెప్పాడని స్థానికులు తెలిపారు. సమాజం కోసం ఆధ్యాత్మిక బాట పట్టినట్లు భోలే బాబు చెప్పారు.. తెల్లటి సూట్, టైతో ఆయన బోధనలు చేస్తుంటాడు అని అక్కడికి వచ్చిన భక్తులు వెల్లడించారు.

Read Also: Vishwaksen: విశ్వక్ లేడీ గెటప్‌లో లైలా.. మొదలెట్టేశాడు..

అయితే, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతో సహా భారతదేశం అంతటా అతనికి పెద్ద ఎత్తున అనుచరులు ఉన్నారు. అలాగే, భోలే బాబా సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు.. ఈ ఆశ్రమంలో కార్యక్రమాల నిర్వహణకు వాలంటీర్లు ఉంటారు.. కరోనా సమయంలోనూ ఈయన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చేవారని స్థానికులు తెలిపారు.

Show comments