Bhojshala case: మధ్యప్రదేశ్ హైకోర్టు ‘‘భోజ్‌శాల కేసు’’లో సంచలన తీర్పు వెలువరించింది. ధార్‌లోని ఈ భోజ్‌శాల సరస్వతీ దేవీ ఆలయంగా హైకోర్టు గుర్తించింది. మందిర్-మసీదు కేసుల్లో ఈ కేసు కూడా దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ కేసులో హిందూ పక్షానికి కీలక విజయం లభించింది. హిందువులకు పూజ చేసుకునే అవకాశం లభించింది. సరస్వతీ దేవీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచించింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు ఈ కేసులో భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) రిపోర్టును ప్రస్తావించింది. ఇది ఒక సంస్కృత విద్యా కేంద్రంగా హైకోర్టు పేర్కొంది. ముస్లింలు మసీదు కోసం ప్రభుత్వాన్ని స్థలం కోరవచ్చని చెప్పింది.
Bhojshala case: భోజ్‌శాల ఒక దేవాలయం.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
- భోజ్‌శాల ఒక దేవాలయం..
- మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..

Bhojshala Temple