Site icon NTV Telugu

Chandra Shekhar Aazad: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు..

Chandra Shekhar Aazad .

Chandra Shekhar Aazad .

Chandra Shekhar Aazad : భీమ్ ఆర్మీ చీఫ్, ఆజాద్ సమాజ్ పార్టీ-కాన్షీరామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్‌పై దుండుగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లోని దేవ్‌బంద్‌లో జరిగింది. సాయుధులైన వ్యక్తులు చంద్రశేఖర్ ఆజాద్ కారును వెంబడించి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఒక బుల్లెట్ ఆజాద్ శరీరంలోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. అతడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సహరాన్‌పూర్ ఆస్పత్రిలో అతడికి చికిత్స జరుగుతోంది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Garlic Chicken Curry :గార్లిక్ చికెన్ కర్రీని ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!

ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ ఆజాద్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆజాద్ కాన్వాయ్ పై కారులో వచ్చిన కొందరు కాల్పులు జరిపినట్లు ఎస్ఎస్పీ డాక్టర్ విపిన్ టాడా తెలిపారు. ఒక బుల్లెట్ తగిలిందని.. అతడు క్షేమంగా ఉన్నాడని, చికిత్స జరుగుతోందని చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తులు హర్యానా నంబర్ ప్లేట్ కలిగి కారులో వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఈ ఘటనలో ఆజాద్ ప్రయాణిస్తున్న కారు అద్దలు పగిలిపోయాయి.

Exit mobile version