NTV Telugu Site icon

Airtel: నిన్న జియో, నేడు ఎయిర్‌టెల్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు..

Airtel

Airtel

Airtel: టెలికాం సంస్థలు వరసగా తమ రీఛార్జ్ ధరల్ని పెంచుతున్నాయి. గురువారం జియో రీఛార్జ్ రేట్లను పెంచగా, తాజా ఎయిర్‌టెల్ కూడా అదే బాటలో నడిచింది. శుక్రవారం మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు ఎయిర్ టెల్ ప్రకటించింది. జూలై 3 నుంచి 10-21 శాతం ధరలు8 పెరుగుతున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్‌లలో 12-27 శాతం పెంపును ప్రకటించిన ఒక రోజు తర్వాత ఇది వచ్చింది. రెండున్నరేళ్ల తర్వాత టెలికాం సంస్థలు వినియోగదారుడిపై భారాన్ని మోపాయి.

Read Also: US Agency Report : హిజ్బుల్లాను నిర్మూలించాలని ఇజ్రాయెల్ ప్లాన్.. లెబనాన్ దాడిపై అమెరికా ఏజెన్సీ నివేదిక

అపరిమిత వాయిస్ ప్లాన్‌లలో, ఎయిర్‌టెల్ టారిఫ్‌ను రూ.179 నుండి రూ.199కి, రూ.455 నుంచి రూ.599కి, రూ.1,799 నుంచి రూ.1,999కి పెంచినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశంలో టెల్కోలకు ఆర్థికంగా ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాలను ప్రారంభించేందుకు ప్రతీ వినియోగదారుడిపై ఆవరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ARPU) రూ. 300 కంటే ఎక్కువగా ఉండాలని భారతీ ఎయిర్‌టెల్ మీడియా ప్రకటనలో తెలిపింది. జియో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు డిసెంబర్ 2021లో మొబైల్ సర్వీస్ రేట్లను పెంచాయి. అంతకుముందు 2019లో టెలికాం సంస్థలు రేట్లను 20-40 శాతం పెంచాయి. 2021లో 20 శాతం పెంచాయి.