NTV Telugu Site icon

Big Breaking: “భారత్”గా మారనున్న”ఇండియా”.

Bharat

Bharat

Big Breaking: ఇండియా పేరును భారత్ గా మార్చేందుకు కేంద్ర సిద్ధమవుతుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్ ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ‘‘రిపబ్లిక్ ఆఫ్ భారత్- మన నాగరికత అమృత్ కాల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా మరియు గర్వంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు.

Read Also: Honda Elevate: హోండా ఎలివేట్ SUV ధరలు ప్రకటన.. రూ. 11 లక్షల నుంచి ప్రారంభం..

ఇటీవల ఇండియా కూటమి పేరుతో కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, శివసేన ఉద్ధవ్, ఎన్సీపీ (శరద్ పవార్), ఆర్జేడీ, జేడీయూ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కలిసి జట్టు కట్టాయి. ఈ నేపథ్యంలో ఇండియా పేరును భారత్ గా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు ఎజెండా ఏమిటో చెప్పకుండా కేంద్ర పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునివ్వడం కూడా ఈ అనుమానాలను బలపరుస్తోంది. అయితే జమిలి ఎన్నికల కోసం ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’పై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ ఆధ్వర్యంలో 8 మంది సభ్యులతో కేంద్రం ఓ కమిటీని నియమించింది. మరోవైపు బీజేపీ ముందస్తుకు వెళ్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.