Honda Elevate: హోండా ఎలివేట్ SUV ధరలు ప్రకటన.. రూ. 11 లక్షల నుంచి ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honda Elevate: జపనీస్ కార్ మేకర్ హోండా తన ఎలివేట్ ఎస్‌యూవీ కార్ రేట్లను ప్రకటించింది. హోండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇండియన్ మార్కెట్ లోకి ఈ కారును ఇంట్రడ్యూస్ చేసింది. ఇండియాలో ఇటీవల కాలంలో ఎస్‌యూవీ కార్ మార్కెట్ పెరుగుతుండటంతో హోండా కూడా దీనిపై దృష్టి సారించింది. భారతీయులు అభిరుచిని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండేలా చూసుకుంది. ఈ సెగ్మెంట్ లో ఇతర కార్లతో పోలిస్తే మెరుగైన ఫీచర్లు అందించామని హోండా చెబుతోంది.
ఎలివేట్ ప్రారంభ ధర రూ. 11లక్షలు (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమవుతాయని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు కార్ డెలివరీలు అందించనుంది. ఈ సెగ్మెంట్ లో ఇప్పటికే మార్కెట్ లో ఉన్న కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటాలకు, మారుతి సుజుకి గ్రాండ్ విటారా మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వననుంది.
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
మొత్త నాలుగు వేరియంట్లలో హెండా ఎలివేట్ లభ్యమవుతోంది. మాన్యవల్, CVT ట్రాన్స్‌మిషన్లలో వస్తోంది. ధరలను పరిశీలిస్తే(ఎక్స్ షోరూం)
వేరియంట్ మాన్యువల్ CVT (ధర లక్షల్లో)
sv రూ.10.99 –
v రూ.12.10 రూ.13.20
VX రూ.13.49 రూ.14.59
ZX రూ.14.89 రూ.15.99
హోండా ఎలివేట్ లో హెండా సిటీలో ఉన్నట్లుగానే 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 121 బీహెచ్‌పీ శక్తిని, 145 ఎన్ఎం టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ట్రాన్స్మిషన్లలో అందుబాటులో ఉంది.
ఫీచర్స్:
ఫీచర్ల విషయానికి వస్తే టెక్ లోడెడ్ గా ఈ కార్ వస్తోంది. ముందు బాగాంలో పెద్ద బ్లాక్ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్స్ ని ఇచ్చారు. టెయిల్ ల్యాంప్ ర్యాపరౌండ్ స్టైల్ ఎల్ఈడీ, 17 ఇంచుల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్లలో 10.25 ఇంచ్ ఐపీఎస్ హెచ్‌డీ టచ్ డిస్ ప్లే, 7 ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇతర ఫీచర్లలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, బ్రౌన్ లెథెరెట్ అప్హోల్స్టరీ మరియు సన్‌రూఫ్ ఉన్నాయి. హోండా సెన్సింగ్ ప్యాకేజీ కింద వచ్చే అనేక ADAS ఫీచర్లను కూడా జోడించింది. ఇందులో లాన్‌వాచ్ కెమెరా, లేన్ కీప్ అసిస్ట్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, కొలిజన్ ఎగవేత బ్రేకింగ్ మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!