Site icon NTV Telugu

Bharat Jodo Yatra: మరో వివాదంలో రాహుల్ గాంధీ.. ఆ వ్యక్తిని కలవడంపై బీజేపీ విమర్శలు

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra.. Rahul Gandhi in another controversy: భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. గతంలో భారతదేశాన్ని, హిందూ మతాన్ని తక్కువ చేస్తూ మాట్లాడిని వివాదాస్పద క్రైసవ మతగురువు ఫాదర్ జార్జ్ పొన్నయ్యతో భేటీ అయ్యారు. అయితే దీనిపై బీజేపీ రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టింది. భారత్ తోడో( భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయండి) గుర్తులతో భారత్ జోడోనా..? అని ప్రశ్నించింది. వివాదాస్పద ఫాదర్ జార్జ్ పొన్నయ్యను రాహుల్ గాంధీ కలవడంపై బీజేపీ అధికార ప్రతినిధి హెషజాద్ పునావాలా ట్విట్టర్ లో విమర్శలు చేశారు.

2021లో జార్జ్ పొన్నయ్య ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డీఎంకే నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశారు పొన్నయ్య. భారత మాత మలినాలు మమ్మల్ని కలుషితం చేయకూడదు కాబట్టి నేను బూట్లు ధరిస్తానని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ షేర్ చేసిన వీడియోలో ఏసుక్రీస్తుపై రాహుల్ గాంధీ, జార్జ్ పొన్నయ్యపై సంభాషణ జరుగుతుంది. ఏసుక్రీస్తు నిజమైన దేవుడా..? అని ప్రశ్నించినప్పుడు.. పొన్నయ్య మనిషి రూపంలో ఉన్న దేవుడు ఏసుక్రీస్తు అంటూ సమాధానం ఇవ్వడం మనకు కనిపిస్తుంది.

Read Also: Lalitha Jewellery In Chandanagar: చందానగర్ లో లలితా జ్యూవెలరీ షోరూం ప్రారంభం

బీజేపీ ట్వీట్ చేసిన పోస్టుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. మహాత్మాగాంధీ హత్యకు, నరేంద్ర దభోల్కర్, గోవింద్ పండరే, ఎంఎం కల్బుర్గి, గౌరీ లంకేశ్ వంటి వ్యక్తుల హత్యలకు కారణమైన వ్యక్తులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. “ఏమిటి ఈ జోక్.. భారత్ జోడో యాత్ర స్ఫూర్తిని దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలు ఘోరంగా విఫలమవుతాయి” అని బీజేపీని ఉద్దేశించి జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందన చూసి బీజేపీ నిరాశ చెందుతుందని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయింది. 150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల గుండా యాత్ర కొనసాగుతుంది. మొత్తం 3570 కిలోమీటర్ల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన ఈ యాత్ర కాశ్మీర్ లో ముగుస్తుంది.

Exit mobile version