NTV Telugu Site icon

Bhagat Singh Koshyari: గుజరాతీ-రాజస్థానీ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన మహారాష్ట్ర గవర్నర్

Bhagat Singh Koshyari

Bhagat Singh Koshyari

Governor bhagat singh koshyari Apologises For Gujaratis-Rajasthanis comments: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో గుజరాతీలు, రాజస్థానీలు థానే, ముంబై, మహారాష్ట్ర నుంచి వెళ్లిపోతే ఇక్కడ డబ్బులు మిగలవని.. ఇక ముంబై ఆర్థిక రాజధానిగా ఉండబోదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. గవర్నర్ కోష్యారిని ప్రతిపక్షాలు విమర్శించాయి. బీజేపీ వ్యక్తిగా గవర్నర్ వ్యాఖ్యలు చేశారంటూ ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. గవర్నర్ మరాఠా ప్రజలను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై గవర్నర్ కోష్యారీ క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే ఇవి గవర్నర్ వ్యక్తిగత వ్యాఖ్యలు అంటూ వీటిని సమర్థించబోనని సీఎం ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యానించారు. మరాఠీ వ్యక్తి అవమానానికి గురువుతున్నాడంటూ.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ః

Read Also: Petrol- Diesel Sales: జూలైలో తగ్గిన పెట్రోల్, డిజిల్ అమ్మకాలు.. పెరిగిన వంట గ్యాస్ వినియోగం

ఇదిలా ఉంటే సోమవారం తన వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి. ఈ మేరకు గవర్నర్ ఆఫీస్ ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. జూలై 29న జరిగిన ఓ పబ్లిక్ ఫంక్షన్ లో ముంబై అభివృద్ధిపై కొన్ని సంఘాలు చేసిన సహకారాన్ని ప్రశంసించే సమయంలో నేను తప్పుగా వ్యాఖ్యలు చేశానని.. మహారాష్ట్రలోనే కాదు మొత్తం భారతదేశంలో ప్రతీ ఒక్కరి సహకారం ఉందని ఆయన అన్నారు. గత మూడు సంవత్సరాలుగా మహారాష్ట్ర ప్రజల నుంచి నేను అపారమైన ప్రేమ పొందానని గవర్నర్ కోష్యారీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, మరాఠీ భాషల గౌరవాన్ని పెంచే విధంగా నా వంతు ప్రయత్నం చేశానని అన్నారు. ప్రసంగంలో పొరపాటున తప్పుచేసినట్లు అయితే… అది మహారాష్ట్ర వంటి గొప్ప రాష్ట్రాన్ని ధిక్కరించినట్లు భావించలేదనని తెలిపారు. వినయపూర్వకంగా మహారాష్ట్ర ప్రజలు రాష్ట్ర సేవకుడిని క్షమించాలని కోరారు.

Show comments