భవానీపూర్ పోలింగ్ ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.. మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మమతా బెనర్జీ.. కీలక ఎన్నిక ఎదుర్కోబోతున్నారు. నందిగ్రామ్‌లో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడినప్పటికీ.. మమతా బెనర్జీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆరునెలల్లోగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఇందుకోసం భవానీపూర్ నియోజకవర్గంలో గెలిచిన వ్యవసాయ మంత్రి శోబన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో మమత పోటీ చేస్తున్నారు. 2011, 2016 ఎన్నికల్లో కూడా మమత.. భవానీపూర్ నుంచే గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఉపఎన్నికలో కూడా గెలిచి.. సీఎంగా కొనసాగాలనుకుంటున్నారు.
ఇటు దేశవ్యాప్తంగా బీజేపీయేతర శక్తుల్ని కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న మమతకు.. బెంగాల్లోనే చెక్ పెట్టాలని కమలనాధులు వ్యూహాలు రచించారు. భవానీపూర్‌లో ప్రియాంక తిబ్రేవాల్‌ను బరిలో దింపారు. ప్రచారానికి చివరి రోజు కూడా టీఎంసీ, బీజేపీ మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో ఎన్నికల సమయంలో ఉద్రిక్తత చెలరేగే ప్రమాదం ఉండటంతో ఈసీ అప్రమత్తమైంది. భవానీపూర్‌లో పోలింగ్ ముగిసేవరకు 144 సెక్షన్ విధించింది. భారీగా 15 కంపెనీల కేంద్ర బలగాల్ని కూడా పోలింగ్ స్టేషన్ల వద్ద మోహరించింది ఈసీ. భవానీపూర్‌తో పాటు బెంగాల్లో మరో రెండు నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!